INDvsAUS : ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు అగ్ని పరీక్ష.. రాణించకుంటే అంతే..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు కీలక మ్యాచ్ ఆడుతోంది. తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన విజయాలు సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ క్రమంలో నాలుగో టెస్టు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. అయితే కొందరు భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించాల్సి ఉంది. లేదంటే మ్యాచ్ ఓడిపోవడంతోపాటు వీళ్లు జట్టులో స్థానం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. వాళ్లు ఎవరంటే?

రవిచంద్రన్ అశ్విన్
టీమిండియాలో టాప్ బౌలర్‌గా పేరొందిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడీ స్పిన్నర్. కానీ అశ్విన్ నుంచి మరెంతో ఆశిస్తున్నారు నిపుణులు. అతను ఇంకా తన బెస్ట్ చూపించలేదని అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో 18 వికెట్లు తీసుకున్నాడీ వెటరన్ బౌలర్. అయితే అతని బౌలింగ్ రిథమ్ అంత గొప్పగా లేదు. దానికితోడు ఆసీస్ ఆఫ్‌స్పిన్నర్లు నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ రాణించడంతో అశ్విన్‌పై మరింత ఒత్తిడి పడుతోంది. అలాగే ఆసీస్ జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు చాలా మంది ఉన్నారు. దీంతో అశ్విన్ ఈ టెస్టులో తన పాత ఫామ్ అందుకొని రాణించాల్సిన అవసరం ఉంది.

శుభ్‌మన్ గిల్
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న గిల్.. మూడో టెస్టులో పెద్దగా రాణించలేదు. రోహిత్‌కు జోడీగా బరిలో దిగిన అతను ఇండోర్ టెస్టు సెకండ్ ఇన్నింగ్సులో నిర్లక్ష్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీంతో అతని ఆటతీరుపై కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలే భారత పిచ్‌లపై గిల్ రికార్డు అంత బాగలేదు. దీంతో నాలుగో టెస్టులో అందరి ఫోకస్ గిల్‌పై పడనుంది. కొత్త బంతితో దూసుకొచ్చే మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కోవడం గిల్‌కు కత్తిమీద సామే. కానీ జట్టులో చోటు నిలుపుకోవాలంటే మాత్రం గిల్ రాణించక తప్పదు.

విరాట్ కోహ్లీ
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరిగి ఫామ్ అందుకున్నట్లే కనిపించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం ఇంకా తన బెస్ట్‌కు చేరుకోలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కచ్చితంగా రాణిస్తాడని అంతా అనుకుంటే కోహ్లీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సిరీస్‌లో అతని బెస్ట్ స్కోరు 44 మాత్రమే. ఈ క్రమంలో నాలుగో టెస్టులో కోహ్లీ కచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే రాహుల్‌ను తప్పించినట్లే అతన్ని కూడా జట్టులో నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్, యశస్వి జైస్వాల్ వంటి యువకులు దేశవాళీల్లో అదరగొడుతున్న క్రమంలో.. కోహ్లీకి నాలుగో టెస్టు చావో రేవో వంటిది. ఈ సిరీస్ తర్వాత మళ్లీ భారత్ టెస్టు మ్యాచ్ ఆడేది డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనే కావడం కూడా కోహ్లీని మరింత తొందరపెట్టే అంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications