
సూర్యకుమార్ యాదవ్
పొట్టి ఫార్మాట్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. తను టీ20ల్లో ఎంత డేజరస్ బ్యాటరో ఇప్పటికే నిరూపించుకున్నాడు. దానికితోడు పర్టిక్యులర్‌గా ఈ ఫార్మాట్‌లో అతను మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో సూర్యకు ప్రమోషన్ ఇచ్చి మూడో స్థానంలో పంపుతారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్‌ను సూర్య డామినేట్ చేయడం గ్యారంటీ అని చెప్పాలి.

రోహిత్ శర్మ
శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడినప్పటి నుంచి రోహిత్ కూడా కోల్పోయిన ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. అలవోకగా బంతిని బౌండరీ దాటించడం రోహిత్ స్పెషాల్టీ. నాగ్‌పూర్ టెస్టులో అదే చేసి చూపించాడీ వెటరన్ ప్లేయర్. టీమిండియా టీ20 జట్ుటలో చోటు దక్కాలన్నా కూడా రోహిత్ రాణించాల్సిన అవసరం ఉంది. దీంతో అతను ఈ సీజన్‌లో రెచ్చిపోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.

విరాట్ కోహ్లీ
ఇప్పుడిప్పుడే మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకుంటున్న కోహ్లీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంత బాగా ఆడతాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ గాడిన పడుతున్న అతను ఐపీఎల్‌లో చెలరేగి తమ ఆర్సీబీ జట్టుకు ఈసారైనా కప్పు అందించాలని గట్టిగా అనుకుంటున్నాడు. రోహిత్‌లాగే టీమిండియా టీ20 జట్టులో కోహ్లీ స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రాణించి మళ్లీ తన స్థానం తిరిగి పొందాలని కోహ్లీ అనుకుంటున్నాడు.

ఎంఎస్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సీజన్‌ను స్పెషల్‌గా మార్చాలని ధోనీ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందరి కన్నా ముందే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది ధోనీనే. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో తనలో ఇంకా సత్తా తగ్గలేదని గ్లింప్స్ చూపించిన అతను.. ఈ సారి మరింత రెచ్చిపోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

హ్యరీ బ్రూక్
ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించిని విధంగా భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్ మ్యారీ బ్రూక్. ఈ ఇంగ్లిష్ క్రికెటర్ కూడా తన కెరీర్‌లో పర్పుల్ ప్యాచ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో కూడా సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. అతని చేరికతో సన్‌రైజర్స్ మిడిలార్డర్ బలంగా తయారవడం ఖాయమే. అలాగే ఐపీఎల్ హిస్టరీలో తన పేరు రాసుకోవడానికి బ్రూక్‌కు ఇదొక మంచి అవకాశం. ఈ క్రమంలో అతను ఈ సీజన్‌లో చెలరేగడానికి రెడీగా ఉన్నట్లే కనిపిస్తోంది.

శామ్ కర్రాన్
మినీ వేలంలో దాదాపు అన్ని జట్లు కొనాలని అనుకున్న ఆటగాళ్లలో శామ్ కర్రాన్ పేరు ముందుంటుంది. కేవలం బ్యాటింగే కాదు.. ప్రధాన పేసర్ బాధ్యతలు కూడా తను మోయగలనని టీ20 వరల్డ్ కప్‌లో కర్రాన్ నిరూపించుకున్నాడు. ఆ టోర్నీలో సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించాడు. అతన్ని భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. అతను కచ్చితంగా ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తాడని నిపుణుల అంచనా.

బెన్ స్టోక్స్
మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరం అవుతాడని ప్రచారం జరిగినా కూడా.. తను మాత్రం ఐపీఎల్ ఆడతానని ప్రకటించాడీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్. స్టోక్స్ మంచి బౌలర్, అవసరమైతే భారీ షాట్లతో విరుచుకుపడగలిగే బ్యాటర్. భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు స్టోక్స్ చాలా కీలకం కానున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో జట్టు పగ్గాలు కూడా అతనికి దక్కే అవకాశం ఉంది.

ఫాఫ్ డుప్లెసిస్
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో డుప్లెసిస్ ఒకడు. గతేడాది చివర్లో జరిగిన బిగ్ బ్యాష్ లీగ్‌లో సెంచరీ బాదిన అతను.. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా చెలరేగాడు. సెంచరీ కూడా సాధించాడు. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్.. ఈసారి ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

శుభ్‌మన్ గిల్
తన కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న గిల్ టీ20 టెక్నిక్‌పై కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు మంచి ఓపెనింగ్స్ అందించినా కూడా అతని ఆటతీరుపై అనుమానాలు తొలగిపోలేదు. అయితే న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20లో సెంచరీ బాదేసి తన ఆటతీరుపై అనుమానాలను చెరిపేశాడీ యువ ఓపెనర్. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ చూస్తుంటే ఈ ఏడాది కూడా ఐపీఎల్‌లో చెలరేగడం గ్యారంటీ అనిపిస్తోంది.

వానిందు హసరంగ
టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ బౌలర్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బౌలర్ వానిందు హసరంగ. గతేడాది ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. గతేడాది చివర్లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హసరంగనే. ఇటీవల కొంచెం గాడి తప్పి పరుగులు ఎక్కువగా ఇస్తున్నా కూడా.. వికెట్లు మాత్రం తీస్తూనే ఉన్నాడీ శ్రీలంక స్పిన్ మాంత్రికుడు. ఆర్సీబీకి ఈ ఏడాది కూడా హసరంగ చాలా కీలకం కానున్నాడు.


Click it and Unblock the Notifications
