Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఐపీఎల్‌కు దూరం అవుతున్న స్టార్ ప్లేయర్లు.. ఇప్పటికి ఎంత మందంటే?

 These star players are missing IPL 2023

క్రికెట్ పండుగ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో మొదలవనుంది. ఈ నెల 31న డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు ఈ లీగ్ కోసం రెడీ అవుతున్నాయి. అయితే కొందరు కీలకమైన ఆటగాళ్లు మాత్రం ఈసారి ఐపీఎల్‌కు దూరం అయిపోయారు. వీళ్లు ఆడితే అభిమానులకు వచ్చే మజానే వేరు కానీ.. ఈ ఏడాది మాత్రం ఈ ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల ఐపీఎల్ 2023కి దూరం అవుతున్నారు.

 ఇలా ఎంత మంది?

ఇలా ఎంత మంది?

టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్‌తోపాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ సమయంలో గాయపడిన విల్ జాక్స్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం అవుతున్నట్లు తెలిసింది.

వెన్నునొప్పితే కొన్ని నెలలుగా బాధ పడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవలే న్యూజిల్యాండ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో అతను మరికొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరం అవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు.

యాక్సిడెంట్ కారణంగా పంత్..

యాక్సిడెంట్ కారణంగా పంత్..

గతేడాది చివర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వెళ్తూ కారు యాక్సిడెంట్‌కు గురైన టీమిండియా వికెట్ కీపింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తాజాగా అతను సరిగా నడిచేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు.

కాళ్లకు తీవ్ర గాయాలవడంతో అతనికి పలు శస్త్రచికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతను ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. అతని గైర్హాజరీలో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు జట్టు పగ్గాలు అప్పగించినట్లు తెలిపింది.

ఇదే జాబితాలో అయ్యర్..

ఇదే జాబితాలో అయ్యర్..

తాజాగా టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ జాబితాలో చేరాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు ఆడుతున్న సమయంలో అతనికి మరోసారి వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో అతన్ని స్కానింగ్‌కు తీసుకెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతనికి అవసరమైతే శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చేలా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

అదే జరిగితే అతను కూడా కొంత కాలం క్రికెట్‌కు దూరం అవక తప్పదు. అప్పుడు ఐపీఎల్‌లో కూడా శ్రేయాస్ ఆడటం జరగదు. ఈ నేపథ్యంలోనే మరో కెప్టెన్‌ను వెతుక్కోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తర్జన భర్జనలు పడుతోంది.

ఇప్పటికే ఐపీఎల్‌కు దూరమైన ఆటగాళ్లు..

ఇప్పటికే ఐపీఎల్‌కు దూరమైన ఆటగాళ్లు..

జస్‌ప్రీత్ బుమ్రా

రిషభ్ పంత్

కైల్ జేమీసన్

ఝై రిచర్డ్‌సన్

ప్రసిద్ధ్ కృష్ణ

విల్ జాక్స్

దూరమయ్యేలా ఉన్న ఆటగాళ్లు..

దూరమయ్యేలా ఉన్న ఆటగాళ్లు..

జానీ బెయిర్‌స్టో

ఆన్రిచ్ నోర్యీ

శ్రేయాస్ అయ్యర్ (మొదటి సగం అయితే ఆడటం లేదు)

Story first published: Thursday, March 16, 2023, 18:08 [IST]
Other articles published on Mar 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+