
విరాట్ కోహ్లీ
గత మూడేళ్లుగా సరైన ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ ఇప్పుడు మళ్లీ గాడిలో పడ్డాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అతను ఎంత బాగా ఆడగలడో టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి రుజువైంది. ఇలాంటి ఫామ్‌లో ఉన్న కోహ్లీ బ్యాటింగ్ లైనప్‌లో ఉండటం ఆర్సీబీకి కచ్చితంగా బలమనే చెప్పాలి. కోహ్లీ ఫామ్‌లో ఉంటే ఒక జట్టు బ్యాటింగ్ భారం మొత్తం తనే మోయగల సమర్ధుడు. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా లేని అతను.. గడిచిన ఆరు నెలల్లో ఐదు సెంచరీలు బాదేశాడు అంటేనే కోహ్లీ మళ్లీ గాడిన పడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన ఐపీఎల్ నాటికి కోహ్లీ పూర్తి ఫామ్ అందుకొని బౌలర్లకు చుక్కలు చూపించేయడం గ్యారంటీ అనిపిస్తోంది.

ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కెప్టెన్ అయిన డుప్లెసిస్ ప్రస్తుతం బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. తను ఇటీవల ఆడిన ప్రతి టీ20 లీగ్‌లో సెంచరీలు నమోదు చేశాడు. కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్న అతను.. ఆర్సీబీకి చాలా కీలకం కానున్నాడు. అంతేకాదు, ఓపెనర్‌గా వచ్చే అతను కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌లతో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడటం గ్యారంటీ అనిపిస్తోంది. గతేడాది 16 ఇన్నింగ్సుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 468 పరుగులు చేసిన ఈ సఫారీ బ్యాటర్.. ఈ ఏడాది మరింత రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

జోస్ బట్లర్
ఈ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్‌కు గట్టి పోటీ ఇచ్చే ఆటగాళ్లలో జోస్ బట్లర్ పేరు మర్చిపోకూడదు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ చేరడంలో బట్లర్‌ది కీలక పాత్ర. మొత్తం 17 ఇన్నింగ్సుల్లో నాలుగు సెంచరీలతో 863 పరుగులు చేశాడీ ఇంగ్లండ్ కెప్టెన్. ఒకానొక సమయంలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ (973) రికార్డు కూడా బట్లర్ బద్దలు కొట్టేస్తాడేమో? అని అభిమానులు అనుకున్నారంటేనే అతను ఏ రేంజ్‌లో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు.

డేవిడ్ వార్నర్
ఐపీఎల్ పేరు వినగానే చెలరేగిపోయే ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఈ లీగ్‌లో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌తో సీజన్ ముగించాడీ ఆస్ట్రేలియా ఓపెనర్. గతేడాది 12 మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన అతను 432 పరుగులతో రాణించాడు. వీటిలో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మరి ఈసారి ఢిల్లీ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు తీసుకున్న అతను.. మరోసారి ఐపీఎల్‌లో తన బ్యాటుతో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.

శుభ్‌మన్ గిల్
ప్రస్తుతం తన కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో సెంచరీలతో చెలరేగిన గిల్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ భారం మోయనున్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా వచ్చిన గిల్ 16 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో 483 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అతను మరింత ధాటిగా పరుగులు చేసేలా కనిపిస్తున్నాడు.

హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ యువ బ్యాటర్ అయిన హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అతనిపై అంచనాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఇటీవల న్యూజిల్యాండ్‌పై టెస్టుల్లో కూడా ధనాధన్ ఆట ఆడిన అతను.. తన తొలి ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ చూస్తుంటే కచ్చితంగా సన్‌రైజర్స్‌కు చాలా విజయాలు అందించేలా కనిపిస్తున్నాడు.

సూర్యకుమార్ యాదవ్
పొట్టి ఫార్మాట్ అంటే రాక్షసుడిలా రెచ్చిపోయే బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన సూర్య.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకంగా మారనున్నాడు. అన్నీ కుదిరితే అతన్ని మూడో స్థానంలో పంపేందుకు కూడా ఈ ఫ్రాంచైజీ ఆలోచిస్తోంది. గతేడాది కేవలం 8 మ్యాచుల్లోనే 303 పరుగులు చేసిన అతను.. గాయం కారణంగా పూర్తి సీజన్ ఆడలేదు. అతను కనుక ఆడితే ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండేది కాదని అభిమానుల వాదన. ఈ ఏడాది మరింత రెచ్చిపోయి ముంబై ఇండియన్స్‌కు మరో ట్రోఫీ అందించేందుకు సూర్యకుమార్ రెడీ అవుతున్నట్లే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












