Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?

These records will be broken in Third INDvsNZ T20I

లక్నో వేదికగా జరిగిన భారత్, న్యూజిల్యాండ్ టీ20 మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో చిట్టచివరకు విజయం మాత్రం భారత్‌ను వరించింది. అయితే మూడో టీ20లో విజయం ఎవరి వశం అవుతుందో చెప్పడం కష్టం. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో మూడు కీలక రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. అవేంటంటే..

భారత్‌పై సోధీ దాడి..

భారత్‌పై సోధీ దాడి..

టీమిండియా ఎక్కువగా బ్యాటింగ్‌పైనే ఆధారపడుతుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌.. ప్రత్యర్థి బౌలర్లకు పీడకలలే మిగులుస్తుంది. కానీ కొందరు బౌలర్లు మాత్రం భారత్‌ను గట్టిగా దెబ్బ తీస్తారు. వారిలో కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ ఒకడు. భారత్‌పై అతను తీసుకున్నన్ని టీ20 వికెట్లు మరెవరూ తీసుకోలేదు. ఇప్పటి వరకు భారత్‌తో 19 మ్యాచులు ఆడిన అతను 26 వికెట్లు తీసుకున్నాడు. అతను మూడో టీ20లో మరొక్క వికెట్ తీసుకున్నాడంటే.. ఒక ప్రత్యర్థిపై అత్యధిక టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో ఐర్లాండ్‌పై 37 వికెట్లు తీసుకున్న రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నాడు.

సూర్యకుమార్ సూపర్ ఛాన్స్

సూర్యకుమార్ సూపర్ ఛాన్స్

ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే టక్కున చెప్పే పేరు సూర్యకుమార్ యాదవ్. ఈ టీమిండియా స్టార్ గతేడాది ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో టీ20లో కూడా రాణిస్తే.. మరో అరుదైన రికార్డు బద్దలు కొట్టే అవకాశం అతని ముందు ఉంది. ఈ మ్యాచ్‌లో కనుక అతను 63 పరుగులు చేస్తే.. న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో అతను రెండో స్థానానికి చేరతాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో కివీస్‌పై సూర్య 260 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ (322)ను దాటాలంటే సూర్య మరో 63 పరుగులు చేయాలి. ఈ జాబితాలో రోహిత్ శర్మ (511) తొలి స్థానంలో ఉన్నాడు.

కివీస్ ముందు కీలక ఛాన్స్

కివీస్ ముందు కీలక ఛాన్స్

ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో న్యూజిల్యాండ్ ఒకటి. కానీ భారత గడ్డపై ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా నెగ్గలేదు. 2012లో ఆడిన టీ20 సిరీస్‌ను ఆ జట్టు నెగ్గినా.. ఆ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఇక మరే సందర్భంలోనూ కివీస్ ఒక సిరీస్ నెగ్గలేదు. ఆ అవకాశం వాళ్లకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచింది. అహ్మదాబాద్‌లో కనుక శాంట్నర్ సేన గెలిస్తే.. భారత గడ్డపై రెండు, అంతకన్నా ఎక్కువ మ్యాచులు ఉన్న సిరీస్‌ను తొలిసారి ఖాతాలో వేసుకుంటుంది. ఈ ఫీట్‌ను సాధించాలని శాంట్నర్ సేన చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది.

Story first published: Wednesday, February 1, 2023, 8:20 [IST]
Other articles published on Feb 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+