
కామెరూన్ గ్రీన్
ఈ ఆస్ట్రేలియా యువ కెరటం.. భారత పర్యటనలో అద్భుతంగా రాణించాడు. వార్నర్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన అతను మూడు టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. దీంతో మినీ వేలంలో అతనికి భారీగా డిమాండ్ పెరిగింది. అతని కనీస ధర కూడా రూ.2 కోట్లు కావడం గమనార్హం.
అయితే పొట్టి ఫార్మాట్‌లో గ్రీన్ కెరీర్ చాలా తక్కువ. ఆస్ట్రేలియా తరఫున అతను కేవలం 21 మ్యాచులు మాత్రమే ఆడాడు. దానికితోడు భారత పర్యటన తర్వాత ఐదు మ్యాచుల్లో ఆడిన అతను కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. రూ.2 కోట్ల బేస్ ధర ఉన్న అతని కోసం రెండు మూడు ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు కానీ.. అందరూ అనుకున్నట్లు రూ.15 కోట్లపైగా మాత్రం అతనికి రావడం కష్టంగా కనపడుతోంది.

అదిల్ రషీద్
ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ అదిల్ రషీద్ కూడా ఈ మినీ వేలంలో హాట్ పిక్‌గా నిలవనున్నాడు. ఇదే విషయాన్ని చాలా మంది చెప్పారు. కానీ ఈ ఏడాది రషీద్ పెద్దగా రాణించింది లేదు. దానికితోడు భారత్‌లో రషీద్ రికార్డు మరీ పేలవంగా ఉంది. ఇంతకుముందు కూడా రషీద్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఎందుకంటే స్పిన్నర్ కోసం విదేశీ ప్లేయర్‌ను తీసుకునే కన్నా.. బిగ్ హిట్టర్‌ను జట్టులో చేర్చడానికి ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపాయి. అయితే టీ20 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్‌లో రాణించడంతో రషీద్‌పై ఆసక్తి పెరిగింది. కానీ ఆ రెండు మ్యాచులు తప్ప ఈ ఏడాది రషీద్ రాణించింది లేదు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు మర్చిపోవడం జరగదు. కాబట్టి అతనికి కూడా భారీ ధర లభించడం గగనమే అని చెప్పాలి.

సికందర్ రజా
ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ కనబరిచిన జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో జట్టును ఒంటి చేత్తో సూపర్-12 దశకు తీసుకొచ్చాడీ ఆల్‌రౌండర్. ఈ దశలో పాకిస్తాన్‌పై అద్భుతంగా రాణించి ఆ జట్టును ఓడించాడు. ఆ సమయంలో రజా ఫామ్ పీక్స్‌లో ఉందని చెప్పాలి. అప్పుడే వేలం జరిగితే అతనిక మంచి ధర వచ్చేది. అయితే ఆ తర్వాత అతని ఫామ్ పడిపోయింది.
లంకన్ ప్రీమియర్ లీగ్‌లో చాలా చెత్త ప్రదర్శన చేశాడు. ఈ లీగ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఫ్రాంచైజీలు రజా ఫామ్‌ను కూడా గుర్తించాయి. కాబట్టి అతనికి కూడా పెద్ద ధర రాకపోవచ్చు. అయితే భారత్‌తో వన్డే సిరీస్‌లో అతను ఒంటరి పోరాటం చేసి, టీమిండియాను ఓడించినంత పని చేసిన సంగతి మర్చిపోకూడదు. తనదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా రజాకు ఉంది.


Click it and Unblock the Notifications












