
సూర్యకుమార్ యాదవ్
గతేడాది నుంచి టీ20 ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే తనకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో మాత్రం చెలరేగి ఆడాలని సూర్య భావిస్తున్నాడు. గతేడాది టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఐసీసీ అవార్డు అందుకున్న సూర్య.. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో రాణించాడు. మరి ఈ సిరీస్‌లో ఎలా ఆడతాడో చూడాలి.

గ్లెన్ ఫిలిప్స్
ఈ కివీస్ విధ్వంసకర బ్యాటర్ కూడా వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆ జట్టు ఈ సిరీస్‌లో వైట్ వాష్ ఎదుర్కొంది. దీంతో ఎలాగైనా ఈ సిరీస్‌లో గెలవాలని కివీస్ ఆటగాళ్లు గట్టిగా అనుకుంటున్నారు. కివీస్ లోయర్ ఆర్డర్‌లో వచ్చి ధనా ధన్ ఆటతో విరుచుకుపడే ఫిలిప్స్ ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాడు. టీ20 ఫార్మాట్లో చెలరేగి ఆడే అతను.. భారత్‌పై ఆడటాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పటి వరకు భారత్‌పై ఆడిన పది టీ20 మ్యాచుల్లో సుమారు 40 సగటుతో 356 పరుగులు సాధించాడు. కాబట్టి అతన్ని టీమిండియా తక్కువ అంచనా వేయకూడాదు.

హార్దిక్ పాండ్యా
ప్రస్తుతం తన కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా పాండ్యా ఆకట్టుకున్నాడు. కేవలం బ్యాటుతోనే కాదు.. బంతితో కూడా పాండ్యా ఈ జట్టుకు కీలకం కానున్నాడు. కివీస్‌పై అతని రికార్డు కూడా బాగానే ఉంది. న్యూజిల్యాండ్‌తో మొత్తం 10 మ్యాచులు ఆడిన పాండ్యా.. 176 పరుగులు చేయడంతోపాటు 7 కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు.

మైకేల్ బ్రేస్‌వెల్
భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో కివీస్‌ను ఒంటి చేత్తో గెలిపించినంత పని చేసిన ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్. ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్న అతను పొట్టి ఫార్మాట్లో కూడా కివీస్‌కు కీలకమైన ఆటగాడే కావడం గమనార్హం. కాబట్టి అతన్ని టీమిండియా తక్కువ అంచనా వేయకూడదు. మొత్తం 13 టీ20లు ఆడిన అతను 17 వికెట్లు తీసుకోవడమే కాకుండా.. 180 పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయడం గమనార్హం.

అర్షదీప్ సింగ్
టీమిండియాలో వేగంగా పరిణితి సాధిస్తున్న బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఒకడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అర్షదీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరంభంలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అతను.. డెత్ ఓవర్లలో యార్కర్లతో ముప్పుతిప్పలు పెడతాడు. కానీ క్రమశిక్షణ లేకపోవడం అతని బౌలింగ్‌కు ప్రధాన సమస్య.
శ్రీలంకతో సిరీస్‌లో కూడా వరుసగా నోబాల్స్ వేసి జట్టును ఓడించినంత పని చేశాడీ పంజాబ్ బౌలర్. అయితే కివీస్‌పై అతని రికార్డు బాగానే ఉంది. వీరిపై 9 మ్యాచులు ఆడిన అర్షదీప్ 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతనిపై కూడా అందరూ ఫోకస్ పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications












