IPL 2023 : ఎవరికీ పెద్దగా తెలీదు.. కానీ ఐపీఎల్‌తో వీళ్లు స్టార్స్ అయిపోవడం ఖాయం!

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసే ఐపీఎల్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలాఖరులోనే ఐపీఎల్ 16వ సీజన్ మొదలైపోతుంది. ఐపీఎల్‌లో కేవలం అంతర్జాతీయ స్టార్లే కాదు. ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాళ్లు కూడా సత్తా చాటి గుర్తింపు పొందడం తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని ప్రమాదకరమైన ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దామా..?

నారాయణ్ జగదీశన్
గతేడాది మినీవేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విడుదల చేసిన కుర్రాడు నారాయణ్ జగదీశన్. ఈ తమిళనాడు బ్యాటర్ 2022లో దేశవాళీల్లో చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 147 బంతుల్లోనే 277 పరుగులు చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతన్ని వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం రూ.90 లక్షలకు కొనేసింది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను నారాయణ్ జగదీశన్ మరింత బలపరుస్తాడని ఆ టీం నమ్ముతోంది.

వివ్రాంత్ శర్మ
ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని పేరు వివ్రాంత్ శర్మ. ఈ జమ్మూ కాశ్మీర్ కుర్రాడు 2021లోనే దేశవాళీల్లో అరంగేట్రం చేశాడు. కానీ డైనమిక్ బ్యాటింగ్‌తో డొమెస్టిక్ సర్కిల్స్‌లో కొంత పేరు సంపాదించాడు. 2021-2022 సీజన్‌లో జమ్మూ కాశ్మీర్ తరఫున దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో 56.42 సగటుతో 395 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను రూ.2.6 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అవకాశం దొరికితే ఐపీఎల్‌లో కూడా చెలరేగడానికి వివ్రాంత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రజత్ పటీదార్
గతేడాది ఆర్సీబీకి దొరికిన మట్టిలో మాణిక్యం రజత్ పటీదార్. నాకౌట్స్ మ్యాచ్‌లో అతను చేసిన సెంచరీ ఇప్పటికీ ఆర్సీబీ అభిమానుల గుండెల్లో భద్రంగా ఉంది. ఆ సెంచరీ తర్వాత పటీదార్ ఎక్కడా వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దేశవాళీల్లో చెలరేగిపోయాడు. గతేడాది కేవలం ఆర్సీబీ తరఫున ఏడు మ్యాచుల్లోనే ఆడిన అతను 55 సగటుతో 333 పరుగులు చేశాడు. భారత బృందంలో అవకాశం దక్కినా కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం మాత్రం ఈ కుర్రాడికి ఇంకా రాలేదు.

అభిషేక్ శర్మ
ఈ ఏడాది ఐపీఎల్‌లో జాగ్రత్తగా గమనించాల్సిన మరో కుర్రాడు అభిషేక్ శర్మ. ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్.. పవర్‌ప్లేలో చెలరేగిపోతాడు. గతేడాది అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌కు చెప్పుకోదగిన ఏకైక విషయం అభిషేక్ ఆటనే. ఈ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసింది ఈ పంజాబ్ కుర్రాడే. దేశవాళీల్లో కూడా రాణించాడు. గతేడాది ఐపీఎల్‌లో 426 పరుగులు చేసిన అతను.. ఈ ఏడాది కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడీ ఆల్‌రౌండర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications