For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!

All set for INDvsNZ third ODI. These batters will be the key factors for their teams.

న్యూజిల్యాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే ఆడేందుకు భారత జట్టు రెడీ అయింది. తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్ ఇప్పటికే సిరీస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే మూడో వన్డే కూడా నెగ్గి సిరీస్ క్లీన్ స్వీప చేయాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో మూడో వన్డేలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఎవరు?

గ్లెన్ ఫిలిప్స్

గ్లెన్ ఫిలిప్స్

ఈ కివీస్ బ్యాటర్ అద్భుతమైన ఆటగాడు. తొలి వన్డేలో కేవలం 11 పరుగులకే అవుటైన అతను.. రెండో వన్డేలో తమ జట్టును కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ మ్యాచ్‌లో కివీస్ టాప్ స్కోరర్ అతనే. ఈ ఇన్నింగ్స్‌లోనే తను ఎందుకు కివీస్ కీలక ఆటగాడో చూపించాడీ 26 ఏళ్ల బ్యాటర్. టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న అతను.. హోల్గర్ స్టేడియంలోని చిన్న బౌండరీలను కచ్చితంగా ఉపయోగించుకోవాలని చూస్తాడు. అదే జరిగితే ఫిలిప్స్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

శ్రీలంక సిరీస్ నుంచే మంచి టచ్‌లో కనిపిస్తున్న రోహిత్ శర్మ.. భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు. హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. సెంచరీ వరకు వెళ్లడం లేదు. అయితే అతని ఆట చూసిన వాళ్లందరూ రోహిత్ గాడిన పడ్డాడని, త్వరలోనే భారీ స్కోరు చేయడం గ్యారంటీ అని అంటున్నారు. చిన్న బౌండరీలు ఉన్న హోల్గార్ స్టేడియంలో రోహిత్ ఈ ఘనత సాధించేలా ఉన్నాడు. గత మ్యాచ్‌లో కూడా వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. మూడో వన్డేలో టాప్ స్కోర్ చేయడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

శుభ్‌మన్ గిల్

శుభ్‌మన్ గిల్

కివీస్‌తో సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్. తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో వన్డేలో కూడా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు గెలిచే సమయానికి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం తన కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న గిల్.. మూడో వన్డేలో కూడా అదే ఫామ్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది. దీంతో ఇక్కడ కూడా తొలి వన్డేలో చేసినట్లే భారీ స్కోరు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు గిల్.

Story first published: Tuesday, January 24, 2023, 10:58 [IST]
Other articles published on Jan 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+