
హార్దిక్ పాండ్యా
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా అందరి మన్ననలు పొందుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరొందిన అతను నిరూపించుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. కానీ వన్డే ఫార్మాట్‌లో తొలిసారిగా అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించారు. అంతేకాదు గాయాల కారణంగా 2020 నుంచి అతను కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడాడు. అవసరం అయితే పాండ్యా పది ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడా? అనేది ప్రశ్న. దానికితోడు భవిష్యత్తులో వన్డేల్లో కూడా జట్టు పగ్గాలు అందుకునే సామర్ధ్యం తనకు ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఉమ్రాన్ మాలిక్
ఎక్స్‌ప్రెస్ పేస్‌తో జట్టులోకి దూసుకొచ్చి జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. టీ20 ఫార్మాట్‌లో ఓ మాదిరి ప్రదర్శనతో రాణించినప్పటికీ.. అతనికి ఇంకా శిక్షణ అవసరం అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వన్డే అరంగేట్రంలో ఉమ్రాన్ రాణించాడు. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు ఐదు వన్డేలు ఆడిన అతను ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఏ స్టేజ్‌లో అయినా ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే సత్తా ఉమ్రాన్‌కు ఉంది. తను ముందు ముందు మరింత ప్రమాదకరంగా మారతానని నిరూపించుకుంటే వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఉమ్రాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంటుంది.

సూర్యకుమార్ యాదవ్
టీ20 ఫార్మాట్‌లో తను ఏంటో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని షాట్లతో వీడియో గేమ్ తరహాలో ఆడేస్తూ ప్రత్యర్థి జట్టకు సింహ స్వప్నంలా మారాడు. అయితే వన్డేల్లో మాత్రం సూర్య ఇంకా తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. తను ఆడిన గత ఐదు వన్డేల్లో నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. మొత్తం కెరీర్‌లో 16 ఇన్నింగ్సులు ఆడిన అతను.. 36 సగటుతో పరుగులు చేశాడు. దేశవాళీల్లో సత్తా చాటుతున్న రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టి సూర్యను జట్టులో ఎంపిక చేయడం అతనికి దక్కిన ఛాన్స్ అని చెప్పాలి. ఈ ఫార్మాట్‌లో కూడా సూర్య తన సత్తా నిరూపించుకుంటే వరల్డ్ కప్ బృందంలో చోటు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు.


Click it and Unblock the Notifications












