Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : ఈ వన్డే సిరీస్ వీళ్లకు అగ్ని పరీక్ష... ఆడకపోతే ఇక ఇంటికే..!

 These players must perform in INDvsSL ODI series

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు సిద్ధం అవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఫామ్ అందుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఈ సిరీస్ కొందరు ఆటగాళ్లకు అత్యంత కీలకంగా మారనుంది. భారత జట్టులో చాలా వరకు ఆటగాళ్లు కన్ఫర్మ్ అయిపోయారు. అయితే కొన్ని స్థానాలకు మాత్రం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు శ్రీలంక సిరీస్ చాలా కీలకం కానుంది. దీనిలో ఫెయిలైతే వాళ్లకు మరో ఛాన్స్ దొరకడం అసాధ్యంగా కనపడుతోంది.

యుజ్వేంద్ర చాహల్

యుజ్వేంద్ర చాహల్

భారత్ వద్ద స్పిన్నర్లకు ఎప్పుడూ కొదవ లేదు. ఇప్పుడు కూడా టీమిండియాలో ఒక్క స్పిన్నర్ స్థానం కోసం యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పోటీ పడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా వన్డే జట్టులోకి తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యుజ్వేంద్ర చాహల్‌కు శ్రీలంక సిరీస్ చాలా కీలకం కానుంది. తొలి మ్యాచ్‌లో చాహల్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ కూడా చేయగలిగే వాషింగ్టన్ సుందర్, ఎటాకింగ్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ కనపడుతోంది. మిగతా రెండు మ్యాచుల్లో కూడా చాహల్ పెద్దగా రాణించకపోతే వన్డే వరల్డ్ కప్ ఆడాలనే అతని కల నెరవేరడం దాదాపు అసాధ్యంగా కనపడుతోంది.

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

భారత జట్టులో ప్రస్తుతం అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. బంగ్లాదేశ్ సిరీస్ నుంచే అతని చెత్త ఫామ్ విమర్శల పాలవుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో అతని కోసం ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను కూడా టీమిండియా పక్కన పెట్టింది. లంకతో జరిగిన తొలి వన్డేలో రాహుల్ ఫర్వాలేదనిపించినా.. అతను అవుటైన విధానం విమర్శలకు దారి తీసింది. అనవసరంగా కొత్త రకం షాట్‌కు ప్రయత్నించి అతను పెవిలియన్ చేరాడు. అతను కనుక ఈ సిరీస్‌లో ఆకట్టుకోకపోతే.. వికెట్ కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో మెరుగ్గా కనిపిస్తున్న సంజూ శాంసన్‌కు అవకాశం దొరికే ఛాన్స్ ఉంది

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

టీ20 క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న సూర్యకుమార్ యాదవ్.. గతేడాది నుంచి వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ చక్కగా రాణిస్తూ జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు. అందుకే లంకతో జరిగిన తొలి వన్డేలో కూడా సూర్యను పక్కన పెట్టిన రోహిత్.. అయ్యర్‌కే అవకాశం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ పెద్దగా రాణించకున్నా అతని బ్యాటింగ్‌లో ఇంటెంట్ స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సూర్యకు ఈ సిరీస్‌లో అవకాశాలు దొరకడం కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ అతను ఆడినా రాణించకపోతే.. సూర్యను కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితం చేస్తారని సమాచారం.

Story first published: Wednesday, January 11, 2023, 8:06 [IST]
Other articles published on Jan 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+