Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 auction:వేలంలో ఈ ప్లేయర్లపై గురి.. టీమ్స్‌లో ఉన్న ఖాళీలు ఇవే!

ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి మూడు నెలల ముందే సందడి మొదలైంది. ఐపీఎల్ వేలం వార్తలతో ఏ జట్టుకు ఏ ప్లేయర్ వెళ్తాడనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. డిసెంబర్ 19న జరగనున్న వేలానికి 333 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి.

రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో ఉన్న ఆటగాళ్లు 23 మంది ఉన్నారు. వీరిలో భారత ప్లేయర్లు హర్షల్ పటేల్,శార్దూల్ ఠాకూర్,ఉమేశ్ యాదవ్. మిగిలిన వారందరూ విదేశీ ప్లేయర్లే. హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, రోసొవ్,స్టీవ్ స్మిత్,కొయెట్జీ,కమిన్స్,క్రిస్ వోక్స్,జోష్ ఇంగ్లిష్,ఫెర్గూసన్,హేజిల్ వుడ్,మిచెల్ స్టార్క్,ముజీబ్ రెహ్మన్,అదిల్ రషీద్,డసెన్,జేమ్స్ విన్సే, అబాట్, ఓవర్టన్,డేవిడ్ విల్లీ,డకెట్,ముస్తాఫిజుర్ తమ కనీస ధర రెండు కోట్లగా నిర్ణయించుకున్నారు.

These players get high demad in IPL 2024 auction.These are the vacancies in the teams

అయితే వీరిలో శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిష్, స్టార్, హేజిల్ వుడ్, ముజీబ్ రెహ్మన్,కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

ఇక కనీస ధర రూ. 1.5 కోట్లతో 13 మంది ప్లేయర్లు ఐపీఎల్ వేలంలో తమ లక్ ను పరిశీలించుకుంటున్నారు. వీరిలో అందరూ విదేశీ ప్లేయర్లు కాగా, హసరంగ, జేసన్ హోల్డర్, మహ్మద్ నబీ, జేమ్స్ నీషమ్, సౌథి కోసం పోటాపోటీ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర బేసిక్ ప్రైజ్ రూ.50 లక్షలతో వేలంలో బరిలోకి దిగుతున్నాడు. రచిన్ వేలంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ప్రతి జట్టులో అత్యధికంగా 25 మంది ప్లేయర్లు మాత్రమే ఉండాలి. వారిలో 8 మంది మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలి. దీని ప్రకారం అధికంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో 12 ఖాళీలు ఉన్నాయి. తర్వాత దిల్లీ క్యాపిటల్స్ లో 9 ఖాళీలు; ఇక గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలో 8 ఖాళీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లలో ఆరు ఖాళీలు ఉన్నాయి.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్ వాల్యూ:
1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 31.4 కోట్లు
2. ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
3. గుజరాత్ టైటాన్స్ -రూ. 38.15 కోట్లు
4. కేకేఆర్ -రూ. 32.7 కోట్లు
5.ఎల్‌ఎస్‌జీ -రూ. 13.5 కోట్లు
6.ముంబై ఇండియన్స్ -రూ.17.75 కోట్లు
7. పంజాబ్ కింగ్స్ -రూ. 29.1 కోట్లు
8. ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
9. రాజస్థాన్ రాయల్స్ -రూ. 14.5 కోట్లు
10. ఎస్‌ఆర్‌హెచ్ -రూ. 34 కోట్లు

Story first published: Tuesday, December 12, 2023, 13:34 [IST]
Other articles published on Dec 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+