IPL 2023 : పాకిస్తాన్‌లో పుట్టిన ఈ ముగ్గురూ.. ఐపీఎల్ ఆడేస్తున్నారుగా..!

ఐపీఎల్ తొలి సీజన్‌లో మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల కారణంగా పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. కొన్నేళ్ల క్రితం ఐపీఎల్‌కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను పాకిస్తాన్ ప్రారంభించింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో మాత్రం పాకిస్తాన్‌లో పుట్టిన ముగ్గురు ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. వాళ్లెవరో ఒకసారి పరిశీలిస్తే..

అదిల్ రషీద్
ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ అదిల్ రషీద్ వచ్చే ఏడాది సన్‌రైజర్స్ తరఫున బరిలో దిగనున్నాడు. అతను ఆడేది ఇంగ్లండ్‌కు అయినా పుట్టింది మాత్రం పాకిస్తాన్‌లోనే. గతేడాది మెగా వేలంలో అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి మాత్రం సన్‌రైజర్స్ అతన్ని బేస్ ధర రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. జట్టులో ఉన్న స్పిన్నర్ కొరతను రషీద్‌తో తీర్చుకోవాలని ప్లాన్ ప్రకారం అతన్ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ దశలో అద్భుతంగా రాణించిన రషీద్ అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే.

మొయీన్ అలీ
పాకిస్తాన్ మూలాలు ఉన్న మరో ఇంగ్లండ్ ఆటగాడు మొయీన్ అలీ. ఈ ఆల్‌రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతేడాది రాణించాడు. వచ్చే ఐపీఎల్‌లో కూడా అదే ఫ్రాంచైజీ తరఫున సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. చెన్నై తరఫున మొయీన్ అలీ చాలా సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అటు బంతితో, ఇటు బ్యాటుతో ఆ జట్టును ఎన్నో మ్యాచులు గెలిపించాడు. అందుకే అతన్ని మెగా వేలానికి ముందు గతేడాది చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అతన్ని మళ్లీ ఈ ఏడాది రిటైన్ చేసుకోవడం ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.

సికందర్ రజా
వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడానికి పాకిస్తాన్‌లో పుట్టిన సికందర్ రజా కూడా ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ జింబాబ్వే ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో జింబాబ్వేను గెలిపించాడు. దీంతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు బేస్ ధర రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది ఐపీఎల్ అరంగేట్రం కోసం రజా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications