For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : గతేడాది కేవలం నెట్ బౌలర్లు.. మినీ వేలంలో భారీ ధరకు కొన్న ఫ్రాంచైజీలు

These net bowlers bagged great deals in mini auction

గతేడాది ఐపీఎల్‌లో ఏ జట్టుకూ ఆడలేదా బౌలర్లు. నెట్ బౌలర్లుగా కొన్ని ఫ్రాంచైజీలతో చేరారు. కొందరు తమకు నెట్ బౌలర్‌గా కూడా కనీసం గుర్తింపు దక్కడం లేదని బాధ పడి మధ్యలోనే ఆ జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయారు కూడా. కానీ కాలం అన్ని సమయాల్లో ఒకేలా ఉండదు కదా. వీళ్లకు కూడా టైమొచ్చింది. ఐపీఎల్ మినీ వేలంలో ఈ నెట్ బౌలర్లు కూడా భారీ ధర పలికారు. వచ్చే ఏడాది మైదానంలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
జోషువా లిటిల్

జోషువా లిటిల్

టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిల్యాండ్‌పై హ్యాట్రిక్ తీసుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడీ ఐర్లాండ్ యువ పేసర్. అంతకుముందు కూడా ఐర్లాండ్ తరఫున బాగానే రాణించాడు. టీ10 లీగ్ వంటి టోర్నీల్లో సత్తా చాటాడు. దీంతో గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని నెట్ బౌలర్‌గా కొనుగోలు చేసింది. అక్కడ తనకు కనీసం గౌరవం దక్కడం లేదని బాధ పడ్డాడు. సీజన్ మధ్యలోనే ఆ ఫ్రాంచైజీని వదిలేసి వెళ్లిపోయాడు. అతన్ని ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టు ఏకంగా రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఐపీఎల్‌లో ఆ జట్టు ప్రధాన పేసర్‌గా లిటిల్ ఎదిగే అవకాశాలు బాగా ఉన్నాయి.

కుల్వంత్ ఖేజ్రోలియా

కుల్వంత్ ఖేజ్రోలియా

ఇతను కూడా ఎడం చేతి వాటం పేసరే కావడం గమనార్హం. తన కెరీర్‌లో ఐదు ఐపీఎల్ మ్యాచులు ఆడిన కుల్వంత్ మూడు వికెట్లు తీసుకున్నాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది అతన్ని నెట్ బౌలర్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉపయోగించుకుంది. అయితే ఈసారి అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది.

మోహిత్ శర్మ

మోహిత్ శర్మ

గతంలో ఐపీఎల్ పర్పుల్ క్యాప్ సాధించిన బౌలర్ మోహిత్ శర్మ. పవర్‌ప్లేలో వికెట్లు తీసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను.. ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయాడు. గతేడాది మెగా వేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని నెట్ బౌలర్‌గా తీసుకుంది. ఈ సెషన్స్‌లో జట్టు యాజమాన్యాన్ని అతను బాగా ఇంప్రెస్ చేసినట్లున్నాడు. అందుకే మినీ వేలంలో బేస్ ధర రూ.50 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది.

ముఖేష్ కుమార్

ముఖేష్ కుమార్

దేశవాళీల్లో అద్భుతంగా రాణించి టీమిండియాకు ఎంపికైన బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్. అతని కోసం మినీ వేలంలో గట్టిగానే పోటీ నెలకొంది. అయితే అందర్నీ వెనక్కు నెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది అదే ఫ్రాంచైజీలో ముఖేష్ నెట్ బౌలర్‌గా సేవలు అందించాడు. కొత్త బంతితో అయినా, పాత బంతితో అయినా వికెట్లు తీయగలిగే సత్తా ముఖేష్ కుమార్ సొంతం. వచ్చే ఐపీఎల్‌లో ఢిల్లీ విజయాల్లో ముఖేష్ కీలక పాత్ర పోషిస్తాడని విశ్లేషకుల అభిప్రాయం.

నిషాంత్ సింధు

నిషాంత్ సింధు

ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో నిషాంత్ సింధు కూడా ఒక సభ్యుడు. ఎడం చేతి వాటం స్పిన్నర్ అయిన ఇతను బ్యాటింగ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ ఆడతాడు. మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్ చివరకు రూ.60 లక్షలకు నిషాంత్‌ను కొనుగోలు చేసింది. గతేడాది చెన్నై వద్దనే నెట్ బౌలర్‌గా ఉన్న అతన్ని రవీంద్ర జడేజాకు బ్యాకప్‌కు తయారు చేయాలనేది చెన్నై ప్లాన్‌గా కనబడుతోంది.

Story first published: Monday, December 26, 2022, 18:01 [IST]
Other articles published on Dec 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+