IPL 2023 : ఈ భారతీయ ఆటగాళ్లకు భారీ ధర ఖాయం.. వేలంలో హోరా హోరీ తప్పదు!

ఐపీఎల్ మినీ వేలానికి సమయం దగ్గర పడింది. ఈ సారి వేలంలో ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లపైనే ఫోకస్ పెడుతున్నారు. అయితే స్వదేశీ ఆటగాళ్లు కూడా కొందరు భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. వీరి కోసం కచ్చితంగా వివిధ ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడతాయి. అలాంటి ముగ్గురు కీలక ఆటగాళ్ల వివరాలు పరిశీలిస్తే..

మయాంక్ అగర్వాల్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్‌ను ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. దీంతో అతను కూడా మినీ వేలంలో దిగాడు. మంచి ఓపెనర్‌గా పేరున్న మయాంక్.. అవసరమైతే కెప్టెన్ బాధ్యతలు కూడా నిర్వర్తించగల సమర్ధుడు. దానికితోడు తనదైన రోజున ఎలాంటి బౌలింగ్‌లో అయినా ఒంటి చేత్తో గెలిపించలగల సత్తా ఉన్న ఆటగాడు. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. దీంతో అతనికి మంచి ధర పలకడం గ్యారంటీగా కనిపిస్తోంది.

ఎన్ జగదీశన్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ తమిళనాడు కుర్రాడిని మినీ వేలానికి ముందే వదిలేసింది. అయితే చెన్నై తనను రిలీజ్ చేసిన తర్వాత జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ సీజన్‌లో అత్యుత్తమంగా ఆడాడు. మిడిలార్డర్‌లో మంచి నమ్మకమైన ఆటగాడు కావాలని అనుకుంటే ఫ్రాంచైజీలు ఇతన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతాయి. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. డొమెస్టిక్ సర్క్యూట్‌లో ఏళ్ల తరబడి ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఏకంగా 277 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కూడా కావడం జగదీశన్‌కు కలిసొచ్చే అంశం.

జయదేవ్ ఉనద్కత్
దేశవాళీల్లో అత్యుత్తమంగా రాణించిన సౌరాష్ట్ర సారధి జయదేవ్ ఉనద్కత్. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన అతన్ని బీసీసీఐ కూడా గుర్తించింది. అందుకే బంగ్లాదేశ్ టెస్టులకు షమీ స్థానంలో ఎంపిక చేసింది. తొలి టెస్టులో ఆడే అవకాశం రాకపోయినా అతను ఎంత కష్టపడ్డాడో, ఎంతగా రాణించాడో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. సౌరాష్ట్ర జట్టు అతని కెప్టెన్సీలో విజయ్ హజారే ట్రోఫీ నెగ్గడాన్ని కూడా ఫ్రాంచైజీలు మర్చిపోవడం కుదర్దు. సో.. అతనికి వేలంలో భారీ ధర లభించే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications