Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఐపీఎల్‌ 2023లో చెలరేగేందుకు.. ఈ విదేశీ ప్లేయర్లు రెడీ..!

These foreign players will fight for Orange Cap in IPL 2023

ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ 16వ సీజన్‌కు రోజుల వ్యవధే ఉంది. అభిమానులతోపాటు ఆటగాళ్లు కూడా ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాటర్లంతా తమ బ్యాటింగ్ విన్యాసాలతో చెలరేగేందుకు, బౌలర్లకు పీడకలలు మిగిల్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లకు 'ఆరెంజ్ క్యాప్' ఇస్తారనే సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పటి వరకు అందుకున్న 13 మందిలో ఎనిమిది మంది విదేశీ ప్లేయర్లే. ఈసారి కూడా ఐపీఎల్‌లో చెలరేగేందుకు కొందరు విదేశీ ప్లేయర్లు రెడీగా ఉన్నారు. వాళ్లెవరంటే?

ఫాఫ్ డుప్లెసిస్

ఫాఫ్ డుప్లెసిస్

ఆర్సీబీ కెప్టెన్ అయిన డుప్లెసిస్ ప్రస్తుతం బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. తను ఇటీవల ఆడిన ప్రతి టీ20 లీగ్‌లో సెంచరీలు నమోదు చేశాడు. కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్న అతను.. ఆర్సీబీకి చాలా కీలకం కానున్నాడు. అంతేకాదు, ఓపెనర్‌గా వచ్చే అతను కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌లతో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడటం గ్యారంటీ అనిపిస్తోంది. గతేడాది 16 ఇన్నింగ్సుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 468 పరుగులు చేసిన ఈ సఫారీ బ్యాటర్.. ఈ ఏడాది మరింత రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

 క్వింటన్ డీకాక్

క్వింటన్ డీకాక్

ఐపీఎల్‌లో పరుగుల వరద పారించేందుకు రెడీగా ఉన్న మరో సౌతాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డీకాక్. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్‌గా వచ్చే ఈ ఎడం చేతి వాటం బ్యాటర్.. టీ20ల్లో జట్టుకు ధనాధన్ ఓపెనింగ్ అందించడంలో సిద్ధహస్తుడు. గతేడాది కూడా లక్నోకు డీకాక్ అద్భుతమైన ఆరంభాలు అందించాడు. మొత్తం 15 మ్యాచులు ఆడిన అతను ఏకంగా 508 పరుగులతో రాణించాడు.

జోస్ బట్లర్

జోస్ బట్లర్

ఈ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్‌కు గట్టి పోటీ ఇచ్చే ఆటగాళ్లలో జోస్ బట్లర్ పేరు మర్చిపోకూడదు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ చేరడంలో బట్లర్‌ది కీలక పాత్ర. మొత్తం 17 ఇన్నింగ్సుల్లో నాలుగు సెంచరీలతో 863 పరుగులు చేశాడీ ఇంగ్లండ్ కెప్టెన్. ఒకానొక సమయంలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ (973) రికార్డు కూడా బట్లర్ బద్దలు కొట్టేస్తాడేమో? అని అభిమానులు అనుకున్నారంటేనే అతను ఏ రేంజ్‌లో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు.

 డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

ఐపీఎల్ పేరు వినగానే చెలరేగిపోయే ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఈ లీగ్‌లో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌తో సీజన్ ముగించాడీ ఆస్ట్రేలియా ఓపెనర్. గతేడాది 12 మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన అతను 432 పరుగులతో రాణించాడు. వీటిలో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మరి ఈసారి ఢిల్లీ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు తీసుకున్న అతను.. మరోసారి ఐపీఎల్‌లో తన బ్యాటుతో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.

 డేవిడ్ మిల్లర్

డేవిడ్ మిల్లర్

గతేడాది టైటిల్ నెగ్గిన గుజరాత్ జెయింట్స్ విజయాల్లో డేవిడ్ మిల్లర్ పాత్ర చాలా కీలకం. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అతను.. గతేడాది 16 మ్యాచుల్లో ఏకంగా 481 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కనుక అతనికి ఆడే అవకాశం ఎక్కువగా వస్తే మరోసారి విధ్వంసం సృష్టించడం గ్యారంటీగా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ జట్టులో అతను ఎంత కీలకమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

Story first published: Monday, March 20, 2023, 15:53 [IST]
Other articles published on Mar 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+