Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : బ్యాటర్లకు పీడకలలు మిగిల్చే విదేశీ బౌలర్లు వీళ్లే..!

These foreign bowlers will take highest wickets in IPL 2023

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 మొదలవడానికి రోజుల వ్యవధే ఉంది. ఈ లీగ్‌లో కేవలం బ్యాటర్లే కాదు. బౌలర్లు కూడా సత్తా చాటి పేరు సంపాదించుకోవడం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి జరిగే ఐపీఎల్ 16వ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసుకునే విదేశీ బౌలర్లు ఎవరనే విషయంపై తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు పర్పుల్ క్యాప్ పొందిన వారిలో విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు.

 వానిందు హసరంగ

వానిందు హసరంగ

గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన బౌలర్ వానిందు హసరంగ. లీగ్‌లో పర్పుల్ క్యాప్ కోసం చాహల్‌తో ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడిన ప్లేయర్ హసరంగ. మొత్తం 16 మ్యాచుల్లో 26 వికెట్లతో చెలరేగాడీ శ్రీలంక స్పిన్ మాంత్రికుడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పరుగులు ఇస్తున్నా వికెట్లు తీయడం హసరంగ స్పెషాల్టీ. అందుకే ఈ ఏడాది కూడా అతను రాణించే అవకాశం ఉంది.

కగిసో రబాడ

కగిసో రబాడ

ఈ సౌతాఫ్రికా పేసర్ ఎంత ప్రమాదకరమైన బౌలరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ ప్లే ఓవర్లతోపాటు డెత్ ఓవర్లలో కూడా అలవోకగా వికెట్లు తీసే సత్తా రబాడ సొంతం. గతేడాది 13 మ్యాచులు ఆడిన అతను ఏకంగా 23 వికెట్లతో రాణించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో కూడా రబాడ చెలరేగాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ 2023లో కూడా రబాడ చెలరేగే అవకాశం ఉంది.

జోఫ్రా ఆర్చర్

జోఫ్రా ఆర్చర్

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన అతను.. ఈ ఏడాది పునరాగమనంలో ఇంగ్లండ్ తరఫున రాణించాడు. బుమ్రా కూడా లేని క్రమంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం అంతా ఆర్చర్‌పైనే ఎక్కువగా ఆధార పడనుంది. డెత్ ఓవర్లలో బొటన వేళ్లు పగలగొట్టే యార్కర్లు వేసే సత్తా ఉన్న ఆర్చర్.. ఈసారి పర్పుల్ క్యాప్‌ కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది.

రషీద్ ఖాన్

రషీద్ ఖాన్

ప్రస్తుతం టీ20ల్లో టాప్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకడు. ఈ ఆఫ్ఘాన్ స్పిన్నర్ తను ఆడిన ప్రతి టీ20 లీగులో రాణించిన అతను.. గతేడాది మాత్రమే ఐపీఎల్‌లో కొంత తడబడ్డాడు. తను ఆడిన 16 మ్యాచుల్లో కేవలం 19 వికెట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఫామ్‌లో లేకపోయినా కూడా విరాట్ కోహ్లీ వంటి స్పెషల్ ఆటగాళ్ల వికెట్లు తీయడం రషీద్ ఖాన్‌కు అలవాటు. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ అతను గాడిన పడినట్లే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ లీడింగ్ వికెట్ టేకర్‌గా అతను నిలిచే అవకాశం ఉంది.

లుంగి ఎన్గిడీ

లుంగి ఎన్గిడీ

ఈసారి ఐపీఎల్‌లో అభిమానులు అంచనాలు పెట్టుకున్న బౌలర్లలో లుంగి ఎన్గిడీ ఒకడు. ఈ సౌతాఫ్రికా పేసర్ తన అరంగేట్రం నుంచి రాణిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు పూర్తిగా ఒక్క ఐపీఎల్ సీజన్ కూడా ఆడని అతన్ని.. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 14 మ్యాచులు ఆడిన అతను 25 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఏడాది పూర్తి సీజన్ ఆడితే అతను చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Monday, March 20, 2023, 17:23 [IST]
Other articles published on Mar 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+