For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ఆసీస్ టాప్ బ్యాటర్‌కు చెక్ పెట్టే బౌలర్లు వీళ్లే!

These bowlers will bother Marnus Labuschagne in BGT series

ఆస్ట్రేలియా జట్టులో టాప్ బ్యాటర్ ఎవరు అంటే చటుక్కున చెప్పే పేరు మార్నస్ లబుషేన్. మిగతా ఆటగాళ్లు ఎంత చక్కగా ఆడినా కూడా ఆసీస్ మిడిలార్డర్‌కు వెన్నెముక లబుషేన్ అని అందరికీ తెలుసు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న లబుషేన్.. భారత్‌లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాడు. అయితే అతనికి చెక్ పెట్టేందుకు ముగ్గురు భారత బౌలర్లు రెడీగా ఉన్నారు. వాళ్లెవరంటే?

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

గాయం కారణంగా గతేడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న జడేజా.. ఆస్ట్రేలియా టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. తన ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు సౌరాష్ట్ర తరఫున రంజీ మ్యాచ్ ఆడిన అతను ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లతో సత్తా చాటాడు. అంతకుముందు 2017లో భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా జడ్డూ అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో 25 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో లబుషేన్‌ను జడ్డూ ఇప్పటికే మూడు సార్లు అవుట్ చేశాడు. ఈసారి కూడా అలాగే చేయాలని జడ్డూ ప్లాన్.

 రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా బౌలర్లలో ఆస్ట్రేలియా టీం వెన్నులో వణుకు పుట్టిస్తున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అతన్ని ఉపఖండంలో ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ జట్టు నానా తిప్పలు పడుతోంది. చివరకు అచ్చం అశ్విన్‌లా బౌలింగ్ చేసే కుర్రాడిని నెట్ బౌలర్‌గా తెచ్చుకుంది. అంతలా ఆ జట్టును వణికించే అశ్విన్ బౌలింగ్ ఆడేందుకు లబుషేన్ కూడా గతంలో చాలా కష్టపడ్డాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందే అశ్విన్‌ను ఎదుర్కోవడానికి తన ఆటలో కొన్ని మార్పులు చేసుకున్నట్లు లబుషేన్ వెల్లడించాడంటేనే అశ్విన్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. 2020-21 బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో లబుషేన్‌ను అశ్విన్ రెండుసార్లు అవుట్ చేయడం గమనార్హం.

మహమ్మద్ సిరాజ్

మహమ్మద్ సిరాజ్

ప్రస్తుతం టీమిండియాలో సూపర్ ఫామ్‌లో ఉన్న బౌలర్ సిరాజ్. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన సిరాజ్ ఆ తర్వాత జట్టులో కీలకమైన సభ్యుడిగా ఎదిగాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సిరాజ్ తన కెరీర్‌లో తీసుకున్న తొలి టెస్టు వికెట్ లబుషేన్‌దే. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్టేజ్‌లో లబుషేన్‌ను రెండుసార్లు అవుట్ చేసిన సిరాజ్.. ప్రస్తుతం తను ఉన్న ఫామ్‌లో ఆ జట్టును ముప్పుతిప్పలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Saturday, February 4, 2023, 15:23 [IST]
Other articles published on Feb 4, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+