For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : రెండో టెస్టులో కళ్లన్నీ ఈ ముగ్గురిపైనే.. టాప్ స్కోర్లు చేసేది వీళ్లే!

These batters will score most runs in second INDvsAUS test

భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టుకు వేదిక సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో రెండు జట్లు విజయం కోసం గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా అదే జోరు చూపించాలని అనుకుంటుంటే.. ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి పోటీలో నిలవాలని ఆస్ట్రేలియా అనుకుంటోంది. ఈ క్రమంలో రెండో టెస్టులో టాప్ స్కోరర్లుగా నిలిచే అవకాశం ఉన్న బ్యాటర్లు ఎవరో ఒకసారి చూస్తే..

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో అంత గొప్ప ఫామ్‌లో లేడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఫామ్ అందుకున్న అతను ఇంకా రెడ్ బాల్ క్రికెట్‌లో ఆ ఫామ్ అందుకోలేదు. అయితే తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఆడిన ఢిల్లీ మైదానంలో రెండో టెస్టు జరుగుతుండటంతో.. కోహ్లీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికితోడు ఢిల్లీలో అతని రికార్డు కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ అతను 77.8 సగటుతో 467 పరుగులు చేశాడు. దీంతో రెండో టెస్టులో అతను భారీ స్కోరు చేయడం ఖాయమని పలువురు నిపుణులు అంటున్నారు. మరి కోహ్లీ ఏం చేస్తాడో మరి.

స్టీవ్ స్మిత్

స్టీవ్ స్మిత్

కెప్టెన్ ఎవరైనా సరే ఆస్ట్రేలియా విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉండేది మాత్రం స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ మీదనే. ఈ విషయం ఆసీస్ అభిమానులకు, నిపుణులకు కూడా తెలుసు. తొలి టెస్టులో స్మిత్ సరిగా ఆడి ఉంటే ఆసీస్ అంత ఘోరంగా ఓడేది కాదు. అసలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటేనే స్మిత్ రెచ్చిపోతాడు. ఈ సిరీసులో అతని సగటు 72.16. ఇంత కన్నా ఎక్కువ యావరేజ్ మరే ఆటగాడికీ లేదు. దానికితోడు భారత్ అంటేనే స్మిత్ చెలరేగుతాడు. భారత్‌పై అతను టెస్టుల్లో 1804 పరుగులు చేయగా.. వీటిలో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తొలి టెస్టులో కూడా లబుషేన్‌తో స్మిత్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కనుక స్మిత్ మళ్లీ తన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తే ఆపడం భారత్‌కు కొంత కష్టమే.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

తొలి టెస్టులో కఠినమైన పిచ్‌పై రోహిత్ బ్యాటింగ్ చేస్తూ.. రెండో మ్యాచులో అతనిపై ఎందుకు భారీ అంచనాలు ఉన్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తొలి ఇన్నింగ్స్‌లోనే 120 పరుగులతో చెలరేగిన అతను.. భారత్ 400 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఆటతీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఆసీస్ బౌలర్లు ఎలాగైనా అతన్ని త్వరగా పెవిలియన్ చేర్చాలని అనుకుంటారు. లేదంటే అతను మరో భారీ ఇన్నింగ్స్ ఆడి, ఆసీస్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Friday, February 17, 2023, 8:22 [IST]
Other articles published on Feb 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+