For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!

These Australia batters may fall victim to Ashwin very easily

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత ప్రధానాస్త్రం రవిచంద్రన్ అశ్విన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అశ్విన్‌ను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా జట్టు అచ్చం అతనిలా బౌలింగ్ చేసే కుర్రాడిని నెట్ బౌలర్‌గా నియమించుకుందంటేనే అతను ఎంత ప్రమాదకరమో చెప్పొచ్చు. మరి ఆసీస్ టీంలో అశ్విన్ బుట్టలో ఈజీగా పడిపోయే బ్యాటర్లు ఎవరో ఒకసారి చూస్తే..

ఉస్మాన్ ఖవాజా

ఉస్మాన్ ఖవాజా

ప్రస్తుతం ఆస్ట్రేలియా టీంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో ఖవాజా ఒకడు. అంతేకాదు, ఆ జట్టులో స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనే ఆటగాళ్లలో కూడా ఖవాజా ఒకడు. అతను అశ్విన్‌ను ఎదుర్కొన్నది తక్కువే అయినా.. 2018లో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లో ఖవాజా తడబడ్డాడన్న మాట మాత్రం వాస్తవం.

అశ్విన్ బౌలింగ్‌లో కేవలం పది పరుగులే చేసిన ఖవాజా.. రెండు సార్లు అవుటయ్యాడు. ఇంతకుముందు ఆసియాలో ఆస్ట్రేలియా జట్టు పర్యటించినప్పుడు ఖవాజా రాణించాడు. అయితే అతను ఇప్పటి వరకు భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడలేదు. సాధారణంగానే ఎడం చేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అశ్విన్.. ఖవాజాను కూడా తన బుట్టలో వేసేసుకుంటాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

ట్రావిస్ హెడ్

ట్రావిస్ హెడ్

ఇటీవలి కాలంలో ఆసీస్ తరఫున టెస్టు, వన్డే ఫార్మాట్లలో అదరగొడుతున్న బ్యాటర్ ట్రావిస్ హెడ్. అయితే ఆస్ట్రేలియా బయట అతని రికార్డు అంతగొప్పగా లేదు. గతేడాది పాకిస్తాన్, శ్రీలంక సిరీసుల్లో ఐదు మ్యాచులు ఆడిన అతను 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. దానికితోడు భారత్‌లో అతను ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ ఆడలేదు.

అసలే లెఫ్ట్ హ్యాండర్లపై తీవ్రమైన ప్రభావం చూపించే అశ్విన్ బౌలింగ్‌ను భారత పిచ్‌లపై ఎదుర్కోవడం అతనికి చాలా కష్టం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా అవతల అతని రికార్డు కూడా చాలా చెత్తగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే భారత పర్యటనలో అశ్విన్‌ను ఎదుర్కోవడం ట్రావిస్ హెడ్‌కు అంత ఈజీ కాదని తెలిసిపోతోంది.

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్ చాలా సార్లు తలపడ్డారు. 2012 నుంచి వీళ్లిద్దరి రికార్డులు చూస్తేనే అశ్విన్‌ను ఎదుర్కోవడం వార్నర్‌కు పెద్ద తలనొప్పి అని అర్థం అయిపోతుంది. అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్ 10 సార్లు అవుటయ్యాడు. అంతేకాదు కేవలం 18.2 సగటుతో 182 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

దానికితోడు వార్నర్ అంత గొప్ప ఫామ్‌లో కూడా లేడు. భారత్‌లో అతని రికార్డు కూడా అంత గొప్పగా లేదు. ఉపఖండంలో అతను 8 టెస్టులు ఆడగా.. కేవలం మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. ఎక్కువగా అశ్విన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. దీంతో ఈసారి నాలుగు టెస్టుల సిరీస్‌లో కూడా అశ్విన్‌దే పైచేయి అవడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

Story first published: Monday, February 6, 2023, 13:47 [IST]
Other articles published on Feb 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+