Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2025: చిన్న వయస్సులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు..

ఐపీఎల్ వేలం 2025 లో కొంత మంది కర్రాళ్లు అనుహ్యా ధర పలికారు. ముఖ్యంగా పిన్న వయస్కులు ఈ ఐపీఎల్ లో వేలానికి వచ్చారు. ఐదుగురు యువ ఆటగాళ్లను వేలంలో ప్రాంచేజీలు కొనుగోలు చేశాయి. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన IPL 2025 మెగా వేలం సందర్భంగా బీహార్‌కు చెందిన 13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్‌కు రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతన వయస్సు 13 ఏళ్ల 243 రోజులు. అతను ఐపీఎల్ చరిత్రలో వేలంలోకి వచ్చిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరికి అతన్న రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా U-19తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేసి అంతర్జాతీయ శతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్ అయ్యాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను 12 సంవత్సరాల వయస్సులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసాడు. ఈ ప్రతిష్టాత్మక దేశీయ టోర్నమెంట్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కులలో ఒకడుగా నిలిచాడు.

These are the players who sold out the IPL at a young age

ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆశాజనక క్రికెటర్ ఆయుష్ మ్హత్రే ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లో, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో అతని అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై 176 పరుగులు చేశాడు ఆయుష్ మ్హత్రే. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 35.66 సగటుతో 321 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ IPL 2025 మెగా వేలం సందర్భంగా ముంబై ఇండియన్స్‌కు రూ.4.8 కోట్లకు కొనుగోలు చేసింది. మాజీ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ దవ్లత్ అహ్మద్‌జాయ్ మార్గదర్శకత్వంలో ఫాస్ట్ బౌలర్ నుంచి మిస్టరీ స్పిన్నర్‌గా మారాడు. అతను 2024 U-19 ప్రపంచ కప్ సమయంలో గుర్తింపు పొందాడు. నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌పై తన ODI అరంగేట్రం చేసాడు.బంగ్లాదేశ్‌తో జరిగిన ఒకే మ్యాచ్‌లో అతను ఆరు వికెట్లు తీసుకున్న అద్భుతమైన ప్రదర్శనతో సహా ఎనిమిది వన్డేల్లో 12 వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, November 27, 2024, 11:30 [IST]
Other articles published on Nov 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+