Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India: ఈ మూడు జరగకపోయుంటే.. ఏడాదంతా టీమిండియాకు చేదు జ్ఞాపకాలే..!

these are the only positives for team india in 2022

2022 ముగింపుకొచ్చింది. ఈ ఏడాదిలో ఏ ఫార్మాట్‌లోనూ టీమిండియా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌ వంటి కీలకమైన టోర్నమెంట్లలో కూడా జట్టు సరైన సమయంలో చేతులెత్తేసి ట్రోఫీలు అందుకోలేకపోయింది. అయితే ఈ ఏడాదిలో మూడు విషయాలు భారత క్రికెట్ అభిమానులకు సంతోషాన్నిచ్చాయి. అవి కూడా జరగకపోయుంటే.. టీమిండియా 2022 డైరీ అంతా చేదు అనుభవాలతోనే నిండిపోయి ఉండేది.

కింగ్ తిరిగొచ్చాడు

కింగ్ తిరిగొచ్చాడు

టీమిండియాలో గడిచిన మూడేళ్లుగా ఫ్యాన్స్ ఆందోళన చెందిన విషయం కింగ్ కోహ్లీ ఫామ్. మూడేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదీ స్టార్ బ్యాటర్. అయితే ఒక నెలరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ నెమ్మదిగా పూర్వపు కోహ్లీ కనిపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఆ మెగా టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తూ టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ దాటి వెళ్లలేకపోయింది. కాగా, ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌ పర్యటనలో తన ఫేవరెట్ వన్డే ఫార్మాట్లో కూడా కోహ్లీ సెంచరీ చేశాడు. ఇక టెస్టు క్రికెట్‌లో కూడా కోహ్లీ ఫామ్ అందుకున్నాడంటే.. అతనికి తిరుగుండదు.

సూర్య, శ్రేయాస్ స్థానాలు పదిలం

సూర్య, శ్రేయాస్ స్థానాలు పదిలం

భారత జట్టులో స్థానం పదిలం చేసుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. అయితే సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ దీన్ని సాధించి చూపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఆకట్టుకుంటున్న వీళ్లు.. జట్టులో ఆయా ఫార్మాట్లలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. టీ20ల్లో నాలుగో నెంబర్ ఆటగాడిగా సూర్య చెలరేగాడు.

దీంతో టీ20 సెటప్‌లో సూర్య ఎంత కీలకమో సెలెక్టర్లకు క్రియర్‌గా తెలిసొచ్చింది. ఇక వన్డే, టెస్టు ఫార్మాట్లో మిడిలార్డర్‌ను శ్రేయాస్ బలోపేతం చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ రాణించి ఆదుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా శ్రేయాస్ చక్కని ఇన్నింగ్సులు ఆడాడు. వీళ్లిద్దరూ తమ తమ ఫార్మాట్లలో జట్టుకు చాలా కీలకమైన ఆటగాళ్లుగా మారారు.

కొత్త పేస్ గుర్రం..

కొత్త పేస్ గుర్రం..

ఈ ఏడాది మొట్టమొదటిసారి టీమిండియా పిలుపు అందుకున్న యువ పేసర్ అర్షదీప్ సింగ్. బుమ్రా లేకపోవడంతో జట్టులో చోటు దక్కించుకున్న అర్షదీప్.. తను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు ఆరంభ ఓవర్లలో వికెట్లు తీసుకోవడం అర్షదీప్ స్పెషాలిటీ. ఇక డెత్ ఓవర్లలో అతను వేసే యార్కర్ల గురించి చెప్పక్కర్లేదు. వాటికి సమాధానం చెప్పడం బడా బడా బ్యాటర్ల వల్లనే కాలేదు.

Story first published: Wednesday, December 28, 2022, 16:51 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+