Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : రెండో వన్డేలో ఎవరు హిట్?.. ఎవరు ఫ్లాప్?

These are the Hits and Flops of INDvsSL second ODI

అద్భుతమైన బౌలింగ్‌తోపాటు మిడిలార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కూడా భారత జట్టు విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత జట్టు.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో చివరకు మ్యాచ్ నెగ్గింది.

ఈ క్రమంలో కోల్‌కతా మ్యాచులో హిట్, ఫ్లాప్ అయిన ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూస్తే..

దాసున్ షనక అట్టర్ ఫ్లాప్

దాసున్ షనక అట్టర్ ఫ్లాప్

భారత బౌలర్లపై విరుచుకుపడే శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. కుల్దీప్ వేసిన బంతిని స్వీప్ చేసే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శ్రీలంకలో భారత్‌కు పెద్ద సమస్యగా మారిన అతను.. ఆ జట్టు స్కోరు 118/4గా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చాడు. తొలి వన్డేలో సెంచరీ చేసి దూకుడుమీదున్న షనక ఈ మ్యాచ్‌లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ కుల్దీప్ యాదవ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలో 4 బంతుల్లో 2 పరుగులు చేసిన షనక పెవిలియన్ చేరాడు. అతను రాణించి ఉంటే శ్రీలంక మంచి స్కోరు చేసి ఉండేది.

కేఎల్ రాహుల్ సూపర్ హిట్

కేఎల్ రాహుల్ సూపర్ హిట్

ఓపెనర్‌గా పెద్దగా రాణించని కేఎల్ రాహుల్.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు. కోల్‌కతాలో కూడా అదే జరిగింది. టాపార్డర్ విఫలమైన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ నిదానంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. లక్ష్యం పెద్దగా లేకపోవడంతో రిస్కులు తీసుకోకుండా ఆడాడు. ఈ క్రమంలోనే 93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా (36), అక్షర్ పటేల్ (21)తో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, భారత జట్టును విజయం దిశగా నడిపించాడు. చివరకు 64 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు.

టీమిండియా టాపార్డర్ ఫ్లాప్

టీమిండియా టాపార్డర్ ఫ్లాప్

తొలి వన్డేలో శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా టాపార్డర్ ఈ మ్యాచ్‌లో కుప్పకూలింది. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ శర్మ కేవలం 17 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగిన శుభ్‌మన్ గిల్ (27) కూడా మిడ్ వికెట్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వీళ్లిద్దరూ కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే మైదానం వీడటంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఇక తొలి వన్డేలో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో రాణించలేదు. మొత్తం 9 బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు. లాహిరు కుమార వేసిన బంతి.. కోహ్లీ బ్యాటును తప్పించుకొని వికెట్లను కూల్చింది. దీంతో భారత జట్టు తొలి పవర్‌ప్లేలోనే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కుల్దీప్ బంపర్ హిట్

కుల్దీప్ బంపర్ హిట్

యుజ్వేంద్ర చాహల్‌కు గాయం అవడంతో జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న అతను అద్భుతమైన బంతులతో శ్రీలంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫ్లయిటెడ్ డెలివరీలు, వేరియేషన్స్‌తో వాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. శ్రీలంక టీంలో సూపర్ ఫాంలో ఉన్న కెప్టెన్ దాసున్ షనక వద్ద కూడా కుల్దీప్ బౌలింగ్‌కు సమాధానం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు వేసిన కుల్దీప్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 200 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న మైలురాయిని కూడా చేరుకున్నాడు. అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది.

Story first published: Friday, January 13, 2023, 12:15 [IST]
Other articles published on Jan 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+