For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : వేలంలో మంచి ధర గ్యారంటీ అనుకుంటే.. చివరకు ఎవరూ కొనలేదు?

These are good players but were unsold at IPL auction 2023

ఐపీఎల్ మినీ వేలం ముగిసినా దాని గురించి క్రీడాభిమానుల్లో చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. ఫ్రాంచైజీలు తీసుకున్న కొన్ని నిర్ణయాలను క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. హ్యారీ బ్రూక్ వంటి యువ ప్లేయర్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం రూ.13 కోట్ల పైగా చెల్లించడం కూడా అలాంటిదే. అయితే వేలానికి ముందు గ్యారంటీగా మంచి ధర పలుకుతారని అనుకున్న కొందరు ఆటగాళ్లను మాత్రం ఎవరూ కొనుగోలు చేయలేదు. వాళ్లు ఎవరో ఒకసారి పరిశీలిస్తే..

రెహాన్ అహ్మద్

రెహాన్ అహ్మద్

ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు సరిగ్గా మినీ వేలం ముందే చాలా హైప్ వచ్చింది. పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన ఈ స్పిన్నర్ అద్భుతమైన ప్రదర్శనతో అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతనికి వేలంలో మంచి ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏ ఫ్రాంచైజీ కూడా ఈ 18 ఏళ్ల లెగ్ స్పిన్నర్‌పై ఆసక్తి చూపించలేదు. బేస్ ధర రూ.50 లక్షలతో ఉన్న అతన్ని పది ఫ్రాంచైజీల్లో ఏదో ఒకటి కచ్చితంగా కొనుగోలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు.

దాసున్ షనక

దాసున్ షనక

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంక సారధి దాసున్ షనక ఎంత మంచి ఫినిషరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆసియా కప్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తేనే అతను ఎంత పవర్ హిట్టరో తెలిసిపోతుంది. బంతితో కూడా రాణించే షనక.. తనదైన రోజున బ్యాటుతో విధ్వంసం సృష్టించగలడు. అలాంటి వాడికి మినీ వేలంలో భారీ ధర గ్యారంటీ అని అంతా అనుకున్నారు. దానికితోడు అతని బేస్ ధర కూడా రూ.50 లక్షలే. ఇంత చీప్‌ ధరలో అంత మంచి ఆల్‌రౌండర్ వస్తుంటే ఎవరైనా కొనేస్తారని అనుకుంటే.. ఒక్క ఫ్రాంచైజీ కూడా షనకను కొనుగోలు చేయలేదు.

వేన్ పార్నెల్

వేన్ పార్నెల్

పొట్టి క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తనదైన వేరియేషన్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో నేర్పరి. బ్యాటుతోనూ విలువైన పరుగులు చేయగల సమర్ధుడు. సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు.. టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన బౌలర్లలో పార్నెల్ కూడా ఒకడు. బేస్ ధర రూ.75 లక్షలతో వేలంలో నిలిచిన అతన్ని ఎవరూ కొనకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

సందీప్ శర్మ

సందీప్ శర్మ

ఐపీఎల్ స్పెషలిస్టుగా అభిమానులు పిలుచుకునే సందీప్ శర్మ 2013 నుంచి 2020 వరకు ప్రతి సీజన్‌లోనూ సత్తా చూపిస్తూనే వచ్చాడు. అయితే చివరి రెండేళ్లలో అతని ఫామ్ కొంత వెనుకబడింది. కానీ ఇటీవల పుంజుకున్న అతను దేశవాళీల్లో సత్తా చూపాడు. విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ రెండిట్లోనూ చక్కని ప్రదర్శన చేశాడు. చాలా ఫ్రాంచైజీల పర్సులో ఇంకా డబ్బులు మిగిలున్న నేపథ్యంలో రూ.50 లక్షలు పెట్టి సందీప్‌ను ఎవరైనా కొనేస్తారనే అనుకున్నారు. కానీ ఏ ఫ్రాంచైజీ అతనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

సౌరభ్ కుమార్

సౌరభ్ కుమార్

కొన్ని రోజుల క్రితం ఇండియా ఎ, బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఏకంగా 15 వికెట్లు తీసుకున్న ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్. అతని సత్తా చూసిన సెలెక్టర్లు బంగ్లాతో టెస్టు సిరీస్‌కు రవీంద్ర జడేజా స్థానంలో ఎంపిక చేశారు. దేశవాళీల్లో అత్యుత్తమంగా ఆడుతున్న అతనికి ఐపీఎల్‌లో మంచి డిమాండ్ ఉంటుందని అనుకున్నారు. బేస్ ధర రూ.20 లక్షలే ఉన్నప్పటికీ ఈ యుటిలిటీ క్రికెటర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యకరం.

Story first published: Monday, December 26, 2022, 15:54 [IST]
Other articles published on Dec 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+