
ఐపీఎల్‌ని మించిన స్కాం మరొకటి
న్యూ ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగిన ‘సాహిత్య ఆజ్ తక్' కార్యక్రమానికి హాజరైన బిషన్ సింగ్ ఐపీఎల్ గురించి మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం మరొకటి లేదని తెలిపారు. ఈ క్రమంలో ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎక్కడికెళ్తుందో ఎవరికి తెలియడం లేదన్నారు. ఐపీఎల్ రెండో సీజన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రి అనుమతి లేకుండనే లక్షల కొద్ది సొమ్ము దేశం దాటి వెళ్లి పోయిందన్నారు.

అలాంటి వారే బెట్టింగ్ వైపు దృష్టి
అంతేకాక ఐపీఎల్ కోసం ఎన్నుకునే ఆటగాళ్లను టీమిండియా సెలక్షన్ ఆధారంగానో, స్థానికంగా జరిగే టీ20ల ఆధారంగానో సెలక్ట్ చేయడం లేదన్నారు. ఒక జట్టులో అధిక మొత్తంలో డిమాండ్ చేసే ఆటగాడితో పాటు.. తక్కువ డబ్బు తీసుకునే ఆటగాడు కూడా ఉంటాడు. తక్కువ ఆదాయం ఉన్న ఆటగాడికి సరైన నైపుణ్యాలు ఉండవు. కానీ అతడు నిలదొక్కుకోవాలి. ఈ క్రమంలోనే డబ్బు సంపాదన అనే అత్యాశతో అలాంటి వారే బెట్టింగ్ వైపు దృష్టి సారిస్తున్నారని చెప్పుకొచ్చారు.

కోహ్లి ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు
ఈ సందర్భంగా బిషన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్ణయాలను తప్పుబట్టారు. అవన్నీ ఏకపక్ష నిర్ణయాలంటూ కొట్టపడేశాడు. అనిల్ కుంబ్లే కోచ్ పదవికి కొన్ని నియమాలు ఉంటాయని చెప్పినందుకు అతనిని విరమణ చేసేలా చేశారంటూ ఆరోపించారు. 'జట్టులో కోహ్లి ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. భారత జట్టు పటిష్టంగా ఉండటం మంచిదే. కానీ, అదే జట్టు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలలో ఏం సాధించింది. ఆ మాటకి వస్తే ఆస్ట్రేలియా జట్టు కూడా బలహీనంగానే ఉంది.'

కెప్టెన్‌గా కోహ్లి మీద విపరీతమైన ఒత్తిడి
'స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు నిషేదం కారణంగా జట్టు నుంచి కొన్ని నెలల పాటు తప్పుకున్నారు. ఈ క్రమంలో వారు జట్టులో భాగమే కానీ, వారి వల్లే జట్టు లేదు కదా. ఇలాగే టీమిండియా అంటే కోహ్లీ మీదే ఆశలు, అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇలా బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా కోహ్లి మీద విపరీతమైన ఒత్తిడి పెట్టడం.. మంచిది కాదని' అన్నారు. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా - ఇండియాటెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది.


Click it and Unblock the Notifications













