రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి.. : ధావన్

హైదరాబాద్: వరుసగా విఫలమౌతున్న రోహిత్‌శర్మను భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ వెనుకేసుకొచ్చాడు. 'గత రెండు వన్డేల్లో కలిపి రోహిత్ 35 పరుగులు మాత్రమే చేశాడు. అది అసలు సమస్యే కాదు, అతని టైమింగ్ సూపర్, గత మ్యాచ్‌లో బాగా ఆడాడు, కానీ దురదృష్టవశాత్తూ ఔట్ అయ్యాడు.' అంటూ వెనకేసుకొచ్చాడు.
రోహిత్ పై తనకు నమ్మకముందని త్వరలోనే ఫాంలోకి వస్తాడనే ధీమాని వ్యక్తం చేశాడు. గత ఛాంపియన్ ట్రోఫీ నుంచి చాలా నిలకడగా ఆడుతున్నాడని తెలిపాడు. కొన్ని సార్లు రోహిత్ పరుగులు చేయలేక పోవచ్చు. కానీ బంతిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ముఖ్యమంటూ ఆటతీరును విశ్లేషించాడు. రోహిత్ ఫామ్ గురించి ఏమాత్రం ఆందోళన అవసరం లేదంటూ కొద్ది కాలంలో నిలదొక్కుగోలడంటూ వ్యాఖ్యానించాడు. సమస్యలు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయంటూ వ్యాఖ్యానించాడు.
జట్టు సభ్యుల మధ్య సమన్వయంతోనే విజయాలు సాధ్యపడతాయని వివరించాడు. జట్టు ఆటగాళ్లలో చాలా సహకారం, సమన్వయం ఉంది, సీనియర్ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా రాణిస్తోందని కొనియాడాడు. యువ ఆటగాళ్లు ఆటలో చాలా పరిణితి కనపరుస్తున్నారని ఆదే తమ బలమని ధావన్ పేర్కొన్నాడు.
సఫారీలతో సిరీస్‌లో తమ బౌలింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేస్తున్న స్పిన్నర్లు చాహాల్, కుల్‌దీప్ యాదవ్‌లపై ధావన్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఏసందర్భంలోనైనా బౌలింగ్ చేయగల సత్తాఉన్న ఆటగాళ్లుగా రాణిస్తున్నారనంటూ ఆకాశానికెత్తేశాడు. చాహల్, కుల్‌దీప్‌లను అర్థం చేసుకోవడం కష్టమైన పని అని, ఎక్కువ మంది ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో ఆడటానికి ఇబ్బంది పడతారని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications