న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు: కోహ్లీ

IPL 2019 : Virat Kohli Says There Is Nothing More To Say To The Team || Oneindia Telugu
There is nothing more to say to the team says Virat Kohli

ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. మ్యాచ్ విజయం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం.. కానీ అది జరగలేదు అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఆదివారం సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా మ్యాచ్‌లలో ఓడి పాయింట్ల ఖాతానే తెరవలేదు. దీంతో ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మాట్లాడారు.

ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాం:

ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాం:

'160 పరుగులు చేస్తే పోరాడడానికి అవకాశం ఉండేది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నా కూడా 150 పరుగులను కాపాడుకునేవాళ్ళం. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాము. పిచ్ పరిస్థితిపై అసహనంగా ఉన్నాను. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయాం. డివిలియర్స్ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాను. స్టోయినీస్, అలీలు బాగా బ్యాటింగ్ చేశారు. పిచ్ విధానంను ఢిల్లీ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు' అని విరాట్ తెలిపారు.

ఓటమికి సాకులు చెప్పలేం:

ఓటమికి సాకులు చెప్పలేం:

'జట్టు ఓటములపై వివరణ ఇవ్వడానికి ఏం మిగలలేదు. ఓటమికి సాకులు చెప్పలేం. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్‌ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. శ్రేయస్‌ క్యాచ్‌ పట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. మ్యాచ్ విజయం కోసం జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అది జరగలేదు. జట్టుగా ఆటను ఆస్వాదించాలి.. లేకపోతే క్రికెట్‌ ఆడలేం. ఏదేమైనా వచ్చే మ్యాచులపై దృష్టి సారిస్తాం' అని విరాట్‌ కోహ్లీ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ విజయం:

ఢిల్లీ విజయం:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ( 41), మొయిన్‌ అలీ ( 32)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్షంను ఢిల్లీ 18.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ 67‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Monday, April 8, 2019, 12:14 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X