For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెత్త పరిస్థితుల్లోనే ఆడాం: షోయబ్ లేడని ధోనీ, పాక్ ఆటగాడికి కోహ్లీ స్ఫూర్తి

లాండర్‌హిల్: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన టీ20 వర్షం కారణంగా రద్దవడం పట్ల టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఇంతకంటే చెత్త పరిస్థితుల్లో కూడా బ్యాటింగ్ చేశానని, వెస్టిండీస్‌లో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ లాంటి వారెవరూ లేరని చెప్పాడు. తడిసిన మైదానంలో ఆడినా తాము గెలిచే వారమని చెప్పుకొచ్చాడు.

మొదటి టీ20లో ఒక్క పరుగుతో ఓటమిపాలైన టీమిండియా రెండో టీ20లో కసిగా ఆడింది. బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్ జట్టు 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా రెండు ఓవర్లకు వికెట్ పడకుండా 15 పరుగులు నమోదు చేసింది.

టీమిండియానే గెలుస్తుందనుకుంటున్న తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ధోనీ కొంత అసహనానికి గురయ్యాడు.

There is 'no Shoaib Akhtar' in West Indies team; I have played in 'worst' conditions: MS Dhoni

2011లో ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంతకంటే చెత్త పరిస్థితులు ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడామని చెప్పాడు. అయితే, మ్యాచ్ రద్దు అనేది ఎంపైర్ల నిర్ణయమని తెలిపాడు. వర్షంలో తడిసిన మైదానాన్ని వెంటనే సిద్ధం చేసేందుకు సరైన పరికరాలు లేవని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్‌ను కొనసాగించలేమని ఎంపైర్లు చెప్పారని ధోనీ తెలిపాడు.

డ్వేన్ బ్రేవో లాంటి బౌలర్ ఉన్నప్పటికీ అతని ప్రభావం తమ బ్యాట్స్‌మన్ అంతగా ఉండదని ధోనీ చెప్పాడు. అతను షోయబ్ అక్తర్ కాదు కదా! అని అన్నాడు. ఒకవేళ షోయబ్ ఆడి ఉంటే పరిగణలోకి తీసుకునేవారమని తెలిపాడు.

పాక్ బ్యాట్స్‌మన్‌కు కోహ్లీ స్ఫూర్తి

భారత స్టార్ ఆటగాడు, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నిలకడైన ఆటతీరుతో అనేక రికార్డులను బద్దలు కొడుతూ.. క్రికెట్ ప్రపంచంలో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేగాక, పలువురు యువ ఆటగాళ్లకు మారిపోతున్నాడు.

తాజాగా, దయాది దేశం పాకిస్థాన్ యువ బ్యాట్స్‌మన్ సమి అస్లామ్ కూడా తనకు స్ఫూర్తి విరాట్ కోహ్లీనే అని ప్రకటించడం గమనార్హం. పాక్‌పాషన్.నెట్ కథనం ప్రకారం.. ఈ 20ఏళ్ల ఆటగాడిపై కోహ్లీ ప్రభావం చాలానే ఉందట. తనకు విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని, అతని ఆటకు తాను అభిమానినని అస్లామ్ చెప్పుకొచ్చాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ ఉత్తమంగా రాణిస్తున్నాడని, అతడ్ని ఆదర్శంగా తీసుకుని తాను ఆటను కొనసాగిస్తున్నానని సమి అస్లామ్ తెలిపాడు. తనతోపాటు యువ ఆటగాళ్లకు కోహ్లీ ఆటతీరు మార్గదర్శకంగా ఉంటుందని అన్నాడు. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్‌లో అస్లామ్‌ను పాక్ మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో 141 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై పాక్ విజయం సాధించింది.

తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన ఈ ఎడమ చేతివాటం ఆటగాడు ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 80, రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. కాగా, తాను కోహ్లీ నుంచి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నానని చెప్పాడు. అంతేగాక, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రసంగం కూడా తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపాడు. కాగా, అస్లాం 2015, ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. అస్లాం తన మంచి ఆటతీరుతో ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాక్ వన్డే జట్టులో కూడా స్థానం పొందే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+