ఒత్తిడి, మరెన్నో కారణాలు: డబుల్ సెంచరీపై కోహ్లీ
ఆంటిగ్వా: ఒత్తిడిలో ఉన్నప్పుడు తనకు మరింతగా ఆడాలన్న కసి ఉంటుందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. వెస్టిండిస్‌తో ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేయడానికి గల కారణాలను కోహ్లీ వెల్లడించాడు.
చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం కష్టమని, తమవల్ల కాదని చెబుతుండటం మనం చాలాసార్లు చూశాం. కానీ కోహ్లీ మాత్రం అందుకు భిన్నంగా సమాధానమిచ్చాడు. గతంలో వెస్టిండిస్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదని నాపై విమర్శలున్నాయని కోహ్లీ చెప్పాడు.
అయితే ఈ పర్యనటలో మాత్రం తాను అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని వంద కొట్ల భారత అభిమానులు కోరుకుంటున్నారని తెలిపాడు. ఆటను మార్చగలిగే సత్తా ఉన్నప్పుడు, అభిమానులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో దానిని మనం తిరిగి ఇవ్వాలని కోహ్లీ చెప్పాడు.
అలా లేని పక్షంలో మనపై ఒత్తిడి పెరుగుతుందని, ఆ ఒత్తిడినే తనకు ఆశీర్వాదంగా భావించి మెరుగైన ఇన్నింగ్స్ ఆడినట్లు కోహ్లీ చెప్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజైన శుక్రవారం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 283 బంతుల్లో 24 ఫోర్లతో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

ఫ్యాన్స్ కోరుకున్నారు: డబుల్ సెంచరీపై కెప్టెన్ కోహ్లీ
కోహ్లీ చేసిన డబుల్ సెంచరీ తొలి టెస్టులో భారత్ పట్టు బిగించేలా చేసింది. సరిగ్గా ఐదేళ్ల కింద ఇక్కడ మూడు టెస్టులాడినా వచ్చి కేవలం 76 పరుగులే చేయడం తనను ఎంతగానో నిరాశకు గురి చేసిందన్నాడు. ఈసారి కోహ్లీ విండీస్ గడ్డపై రాణించాలని అభిమానులు కోరుకున్నారని, ఇప్పుడు అది సాధ్యమైందని చెప్పాడు.

ఫ్యాన్స్ కోరుకున్నారు: డబుల్ సెంచరీపై కెప్టెన్ కోహ్లీ
సెంచరీనే నమోదు చేయని గడ్డపై ఏకంగా డబుల్ సెంచరీ సాధించినందుకు ఈ సిరిస్ తనకెప్పుడూ ప్రత్యేకమేనని చెప్పుకొచ్చాడు. క్రీజులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటానని, అందుకే అవతలి వైపున కూడా తానే ఉన్నట్లు ఫీలవుతానని మ్యాచ్ అనంతరం మీడియాతో కోహ్లీ చెప్పాడు.

ఫ్యాన్స్ కోరుకున్నారు: డబుల్ సెంచరీపై కెప్టెన్ కోహ్లీ
ఈ డబుల్ సెంచరీతో విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. వ్యక్తిగతంగానూ టెస్టు కెరీర్‌లో కోహ్లీకిదే అత్యుత్తమ స్కోరు. అంతకుముందు 2014లో బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై కోహ్లీ అత్యధికంగా 169 పరుగులు సాధించాడు.

ఫ్యాన్స్ కోరుకున్నారు: డబుల్ సెంచరీపై కెప్టెన్ కోహ్లీ
1990లో న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో అప్పటి కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్(192) పేరిట నమోదైన 26 ఏండ్ల కిందటి రికార్డు బద్దలైంది. అంతేకాదు విండీస్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. గతంలో ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఫ్యాన్స్ కోరుకున్నారు: డబుల్ సెంచరీపై కెప్టెన్ కోహ్లీ
గతంలో ఆస్ట్రేలియాపై ధోనీ (224), న్యూజిలాండ్‌పై సచిన్ టెండూల్కర్ (217), వెస్టిండీస్‌పై గవాస్కర్ (205), ఇంగ్లండ్‌పై మన్సూర్ అలీఖాన్ పటౌడీ (203 నాటౌట్) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కోహ్లీ ఖాతాలో 11 సెంచరీలు ఉంటే అందులో ఎనిమిది విదేశీ గడ్డపైనే నమోదైనవి కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications