For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబర్ అజామ్ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపముంది: పాక్ మాజీ క్రికెటర్

There is fault in Babar Azams technique: Aamer Sohail makes heads turn with latest claim

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కొత్త కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఓ చిన్న లోపముందని ఆ దేశ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ పేర్కొన్నాడు. గత ఏడాది పాకిస్థాన్ వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ని తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఇటీవల వరకూ ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగించలేదు. త్వరలో ఇంగ్లండ్ పర్యటన ఉండడంతో ఆజమ్‌కు కెప్టెన్సీ కట్టబెట్టారు. బాబర్ ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో చర్చ

సోషల్ మీడియాలో చర్చ

బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఎన్నికయిన తర్వాత ఆ దేశ మాజీలు కొందరు అతనిపై మండిప‌డుతున్న విషయం తెలిసిందే. మరికొందరు బాబర్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని, సుదీర్ఘకాలం పాక్‌ జట్టును కెప్టెన్‌గా నడిపించగలడు అని, విజయవంతమైన కెప్టెన్ల జాబితాలోనూ అతని పేరు ఉంటుందన్నారు. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా అతని గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. బ్యాట్స్‌మెన్‌గా మునిపటిలా రాణించగలడా?, కెప్టెన్‌గా ఏ మేరకు పాక్ జట్టుని నడిపించగలడు? అని చర్చ నడుస్తోంది. తాజాగా అమీర్ సోహైల్ మాత్రం బాబర్ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపముందన్నాడు.

బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్న లోపముంది

బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్న లోపముంది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీర్ సోహైల్ మాట్లాడుతూ... 'బాబర్ అజామ్ బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్న లోపముంది. అది షాట్స్ ఎంపికపరంగా కాదు. క్రీజులో అతని సెటప్, స్టాన్స్ పరంగా కొంత బలహీనంగా ఉన్నాడు. బాబర్ ప్రతి బంతినీ ఎదుర్కొనే ముందు.. మొదటగా అతను ఆఫ్ స్టంప్‌‌ లైన్‌పైకి వెళ్తున్నాడు. బహుశా బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ ఔట్ నుంచి తప్పించుకునేందు అతను అలా కాకదులుతున్నాడేమో?. కానీ ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితే బౌలర్లపై మరింత ఆధిపత్యాన్ని చెలాయించగలడు' అని సోహైల్ చెప్పాడు.

కోహ్లీ గణాంకాలు ఇలా లేవు

కోహ్లీ గణాంకాలు ఇలా లేవు

2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 26 టెస్టులాడి 45.12 సగటుతో 1,850 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసాడు. వన్డేల్లో 11 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 38 టీ20లు ఆడి 50.72 సగటుతో 1,471 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 25 ఏళ్లు కాగా.. ఈ వయసులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గణాంకాలు ఇలా లేవు.

 పాక్ విరాట్ కోహ్లీ

పాక్ విరాట్ కోహ్లీ

గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న బాబర్ అజామ్‌ని పాకిస్థాన్ అభిమానులు ముద్దుగా.. పాక్ 'విరాట్ కోహ్లీ' అని పిలుచుకుంటారు. అక్కడితో ఆగకుండా కోహ్లీని మించిపోయాడని కామెంట్లు చేస్తారు. అయితే 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కోహ్లీతో కేవలం ఐదేళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న బాబర్‌ని పోల్చడం సరికాదని కొందరు అంటున్నారు. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అజామ్‌ అగ్రస్థానంలో ఉండగా.. వన్డేలలో 3, టెస్టులలో 5వ స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, June 8, 2020, 12:46 [IST]
Other articles published on Jun 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+