
జాగ్రత్త పడడమే ముఖ్యం
'కొత్త బంతితో బౌలర్లను ఎదుర్కోవడం చాలా సవాలుతో కూడుకున్నది. భారత బౌలర్లు బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలరు. దక్షిణాఫ్రికాలో మేం అలవాటు పడ్డ పిచ్‌లతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ స్వింగ్ వస్తుంది. మేం స్వింగ్ వల్ల ఎక్కువ నష్టపోకుండా చూసుకుంటాం. వికెట్లు పడకుండా జాగ్రత్త పడడమే ముఖ్యం. ఆ తర్వాత బంతి కాస్త పాతబడ్డాక ఊపందుకోవడానికి ప్రయత్నించొచ్చు. భువీ, బుమ్రా ఎల్లప్పుడూ కొత్త బంతితో సవాలు విసురుతారు' అని బవుమా అన్నాడు.

వాళ్లిద్దరు ఫాంలోకి రావడంతో
ఇకపోతే ఈ సిరీస్‌కు బుమ్రా, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఎంపికయ్యారు. భువనేశ్వర్ కుమార్‌కు ప్రపంచకప్‌కు ముందు విశ్రాంతినిచ్చారు. విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ ముందు తిరిగి ఫామ్‌లోకి రావడం, అలాగే రోహిత్ శర్మ కూడా గాడిలో పడడంతో భారత బ్యాటింగ్ దుర్భేద్యంగానే కన్పిస్తుంది. 'సహజంగానే రోహిత్, విరాట్ భారత్ తరఫున ఆడుతున్న పెద్ద ప్లేయర్లు. ఇటీవల వారి ప్రదర్శనల వల్ల ఆ జట్టు ఆత్మవిశ్వాసం భారీగా పెరిగింది. ఉత్తమమైన జట్టుకు వ్యతిరేకంగా మేం ఆడబోతుండడం మాకు మేలు చేస్తుంది.' అని బవుమా చెప్పాడు.

చివరి సారి వర్షం కారణంగా సిరీస్ టై
దక్షిణాఫ్రికాతో జూన్‌లో జరిగిన సిరీస్లో 2-2తో ఇరు జట్లు సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో డిసైడర్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. ఫలితంగా సిరీస్ టై అయింది. 'పోయిన సారి మేము ఇక్కడకు వచ్చినప్పుడు మమ్మల్ని మేం టెస్ట్ చేసుకున్నాం. మాకు మంచి సవాల్ దక్కింది. కానీ మేము దానికి చాలా బాగా సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా. ప్రస్తుత సిరీస్, పోటీగా ఉంటుందని ఆశిస్తున్నా. ప్రపంచకప్‌కు ముందు ఇదే చివరి సిరీస్, జట్టులో ఎలాంటి లోటు పాట్లు ఉన్నా పూడ్చుకోవాలని చూస్తున్నాం' అని బవుమా చెప్పాడు.

ఇరు జట్లు
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
సౌతాఫ్రికా : టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నార్జ్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, రివైస్ రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, బ్జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో


Click it and Unblock the Notifications












