
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా బుధవారం అడిలైడ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇండియా ఇప్పటికే అడిలైడ్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. అయితే బంగ్లాతో జరిగే మ్యాచ్ కు వర్షం అడ్డు తగిలే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అడిలైడ్‌లో 90% వర్షం కురిసే అవకాశం ఉందట. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. బంగ్లా దేశ్ తో జరిగే మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దు అయితే చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగితే భారత్ జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారత్ తప్పక గెలవాలి.
విరాట్ కోహ్లి
ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక విజయం సాధించాలి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా సెమీస్ కు వెళ్లడం దాదాపు ఖాయమైంది. టీమిండియా అడిలైడ్ చేరుకునే క్రమంలో విరాట్ కోహ్లీ ఓ ఫొటోను ఇన్ స్టాలో చేషే చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ''సర్ హోటల్ గదిని లాక్ చేసుకుని వెళ్లండి. ఆటతో పాటు మీ భద్రత కూడా మాకు ముఖ్యమే. దయచేసి జాగ్రత్తగా ఉండండి'' అంటూ కోహ్లికి సలహా ఇస్తున్నారు.