'పృథ్వీ షా బ్యాటింగ్ చేసే తీరు, టెక్నిక్ సెహ్వాగ్‌ను గుర్తుకు తెస్తోంది'

హైదరాబాద్: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు అనేక అత్యుత్తమ విజయాలను అందించాడు. పృథ్వీ షా బ్యాటింగ్ చేసే తీరు, అతని టెక్నిక్ సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాయని వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా సెంచరీ నమోదు చేసిన అరుదైన రికార్డుని నెలకొల్పాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న పృథ్వీ షా బ్యాటింగ్‌పై బ్రియాన్ లారా మాట్లాడారు. పృథ్వీషాలో అద్భుతమైన ప్రతిభ దాగుందని... అతని బ్యాటింగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కనిపిస్తున్నాడని, బంతిని బాదే తీరు అచ్చం సెహ్వాగ్‌ను గుర్తుకు తెస్తున్నాడని లారా చెప్పుకొచ్చాడు.

లారా మాట్లాడుతూ
స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ డగౌట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో లారా మాట్లాడుతూ "నజఫ్‌గర్ నవాబ్‌లోని బ్యాటింగ్ లక్షణాలు పృథ్వీషా ఆటలో కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అతడి ఆటను చూశాను. భారత గడ్డపై ఓ యువ ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం నిజంగా అద్భుతం" అని కొనియాడాడు.

19ఏళ్లకే రెండో సీజన్ ఐపీఎల్ కూడా ఆడాడు
"పృథ్వీ షా 19ఏళ్లకే రెండో సీజన్ ఐపీఎల్ కూడా ఆడాడు. రెండు సీజన్‌ల నుంచి ఈ లీగ్‌లో ఆడుతుండటంతో బాగా అనుభవం సంపాదించాడు. ఇప్పుడు పృథ్వీ షా కూడా సీనియర్ ఆటగాడు అంటూ లారా నవ్వుతూ చెప్పాడు. పృథ్వీ షా నుంచి రావాల్సిన క్రికెట్ ఇంకా ఎంతో ఉంది" అని లారా తెలిపాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌తో అరంగేట్రం
కాగా, పృథ్వీషా గతేడాది ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, వార్మప్ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆ సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు.

పృథ్వీ షా కెప్టెన్సీలో వరల్డ్ కప్ నెగ్గిన భారత్
పృథ్వీ షా కెప్టెన్సీలో భారత అండర్-19 జట్టు 2018లో వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన పృథ్వీ షా 169 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications