T20 World Cup 2022: వ్యూవర్‌షిప్‌లో రికార్డు సృష్టించిన జింబాబ్వే, పాకిస్థాన్ మ్యాచ్.. ఎంత మంది చూశారంటే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం మెల్ బోర్న్ లో ఇండియా, పాకిస్థాన్ కు మధ్య జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇంత ఉత్కంఠను ఏ మ్యాచ్ లో కూడా చూడ లేదు. చివరి ఓవర్ లో తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ను ఓటీటీ యాప్ అయిన హాట్ స్టార్ లో కోటికి పైగా మంది చూశారు. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకోవడంతో రికార్డు వ్యూస్‌ను తెచ్చిపెట్టింది.

కోటీ 80 లక్షల వ్యూస్
ఈ మ్యాచ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూవర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్ దెబ్బకు గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఆసియాకప్ వేదికగా భారత్ X పాక్ తొలి మ్యాచ్ కోటీ 30 లక్షల వ్యూస్‌తో ఐపీఎల్ 2022 సీజన్, గత టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా భారత్ X పాక్ మ్యాచ్ కోటీ 80 లక్షల వ్యూస్ రాబట్టింది.
జింబాబ్వే, పాకిస్థాన్
తాజాగా గురువారం జింబాబ్వే, పాకిస్థాన్ మ్యాచ్ వ్యూవర్‌షిప్ కూడా భారీగా పెరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చంసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులుచేసింది. ఓపెనర్లు కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన వారు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మాధేవేరే 17 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ ఎర్విన్ 19 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ 28 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
6.6 మిలియన్లు
131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కు చివర్లో భారీ వ్యూవర్‌షిప్ వచ్చింది. ఈ మ్యాచ్ ను హాట్ స్టార్ 6.6 మిలియన్ల మంది చూశారు. 2022లో ఇప్పటి వరకు ఇండియా ఆడిన మ్యాచ్ లు కాకుండా అత్యధిక వ్యూయర్‌షిప్ వచ్చిన మ్యాచ్ ఇదే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications