For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: వర్షంతో ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు..

The World Cup Super-12 match between Afghanistan and Ireland was canceled due to rain

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన సూపర్-12 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మెల్ బోర్న్ లో వర్షం అదే పనిగా కురుస్తుండడంతో మ్యాచ్ ను నిర్వహించలేకపోయారు. కనీసం టాస్ కూడా వేయలేదు. ఎంత సేపు వేచి చూసినా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రానుంది.

సూపర్-12 గ్రూప్-1 లో ఇప్పటికే వర్షం కారణంగా న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ రద్దు అయింది. తాజాగా ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో ఆఫ్ఘానిస్తాన్ రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా ఆడలేకపోయింది. దీంతో మొత్తం 3 మ్యాచ్ లు ఆడిన ఆఫ్ఘానిస్తాన్ ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. మిగతా రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఒకో పాయింట్ వచ్చింది. దీంతో ఆఫ్ఘానిస్తాన్ కు మొత్తం 2 పాయింట్లు సాధించింది.

ఇక గ్రూప్-1 లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్ ఆడిన కివీస్ ఒక మ్యాచ్ లో గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. న్యూజిలాండ్ 3 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఐర్లాండ్ 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదుపరి స్థానాల్లో ఉండగా.. ఆప్ఘానిస్తాన్ చివరి పోజిషన్ లో ఉంది.

ఉక గ్రూప్-2 భారత్ అగ్ర స్థానంలో ఉంది. రెండు మ్యాచ్ లు ఆడిన ఇండియా రెండింటీలో విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఉంది. సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 3 పాయింట్లతో రెండు స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉన్నాయి. నెదర్లాండ్స్ చివరి స్థానంలో ఉంది.

Story first published: Friday, October 28, 2022, 11:55 [IST]
Other articles published on Oct 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+