Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్‌కు ముచ్చెమటలు పట్టించిన నెదర్లాండ్స్.. ఓటమి అంచు నుంచి విండీస్‌ను గెలిపించిన బ్రాండన్ కింగ్

The West Indies won the ODI series against the Netherlands with Brandon King scoring an unbeaten 91 in second ODI.

నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి వన్డే మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో సులభంగా గెలిచిన వెస్టిండీస్, 2వ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆమ్‌స్టెల్‌వీన్‌లో రెండో వన్డే జరగగా.. మరో 4.3ఓవర్లు మిగిలి ఉండగానే 5వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. అయితే నెదర్లాండ్స్.. కాసేపు వెస్టిండీస్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ బ్రాండన్ కింగ్ (91పరుగులు) చేయడంతో విండీస్ గెలుపొందింది. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్ ఓపెనర్లు 101పరుగుల మంచి భాగస్వామ్యాన్ని అందించారు. 21వ ఓవర్‌లో మొదటి వికెట్ పడిపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ లయ దెబ్బతింది. వారు రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లు కోల్పోయారు. చివరకు 48.3ఓవర్లలో 214పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. వికెట్ కీపర్ కం బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ 89బంతుల్లో 68పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బౌలింగ్లో వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ తన 10ఓవర్లలో 39పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. ఇక మిడిల్ ఓవర్లలో పార్ట్ నర్ షిప్ బిల్డ్ కాకుండా అడ్డుకున్నాడు.

215 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో ఒక దశలో 99పరుగులకే 5వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ తీవ్ర కష్టాల్లో పడింది. బౌలర్ బాస్ డి లీడే ఎనిమిది ఓవర్లలో 46పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీయడంతో వెస్టిండీస్ కాస్త తడబడింది. నెదర్లాండ్స్ గెలుపు లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్.. కీసీ కార్తీతో ఇన్నింగ్స్ విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో బ్రాడన్ కింగ్ 91పరుగులు చేశాడు. ఇక వీరిరువురు 118పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేయడంతో 45.3ఓవర్లలోనే వెస్టిండీస్ గెలుపొందింది. మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

Story first published: Friday, June 3, 2022, 8:22 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+