T20 World Cup 2022: వర్షం కారణంగా ఇండియా, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ రద్దు..

వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ రద్దయింది. గబ్బా భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరు జట్లు ఇప్పటికే ఒక్కో వార్మప్ మ్యాచ్ ఆడాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 50 పరులుగు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
సూపర్-12
ఇటు న్యూజిలాండ్ సౌతాఫ్రికాతో తలపడగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 98 పరుగులకే ఆలౌట్ అయింది. సూపర్ -12లో భాగంగా 22న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 23న ఇండియా పాకిస్థాన్ తో పోటీ పడనుంది. వర్షం కారణంగా ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం పాక్ బ్యాటింగ్ రాగా.. వర్షం పడి మ్యాచ్ రద్దయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications