ద్రవిడ్‌కు ఖండాంతరంగా అందుతున్న శుభాకాంక్షల వెల్లువ


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో రాహుల్ ద్రవిడ్‌కు స్థానం కల్పించింది. దుబాయిలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఐసీసీ చీఫ్ ఎగ్జిక‍్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపారు. రాహుల్‌కు ఈ స్థానం దక్కడం పట్ల ఖండాంతరంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
'నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుదీర్ఘకాలం నేను క్రికెటర్‌గా ఎదిగేందుకు సాయపడిన కోచ్‌లు, అధికారులు... ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లతో పాటు నా విజయాలను గుర్తించి హాల్ ఆఫ్ పేమ్‌లో ఎంపిక చేసినందుకు గాను ఐసీసీకి ధన్యవాదాలు అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మహిళా జట్టు మాజీ వికెట్ కీపర్ క్లెయిర్ టేలర్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. కాగా, భారత్ తరుపున ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. అంతకముందు బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేలు భారత తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. భారత అండర్-19, భారత-ఎ జట్లకు ప్రస్తుతం కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తోన్న ద్రవిడ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు.
ఎట్టకేలకు హాల్‌లో వాల్‌కు స్థానం
ఈ సందర్భంగా తన సహచరుడికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశాడు. `ద్రవిడ్‌కు అభినందనలు. ఎట్టకేలకు హాల్‌లో వాల్‌కు స్థానం దక్కింది. ఈ గౌరవానికి ద్రవిడ్ పూర్తిగా అర్హుడు` అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
ఇది జాతికే గర్వకారణం
'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు రాహుల్ భయ్. ఇది జాతికే గర్వకారణం. ఇలాంటి మున్ముందు మరెన్నో దక్కించుకోవాలని కోరుకుంటాన్నా.'
బ్యాటింగ్ అడగాలంటే రాహుల్ ద్రవిడ్‌నే
('నా జీవితం కోసం ఎవరినైనా బ్యాటింగ్ చేయమని అడగాలంటే రాహుల్ ద్రవిడ్‌నే అడుగుతా.'-బ్రియన్ లారా) ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించి ద్రవిడ్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది.
ద్రవిడ్‌తో కలిసి కూర్చొనే అవకాశం రావడం అదృష్టం
ఇంకొక ట్వీట్‌లో 'మాకు ద్రవిడ్‌తో కలిసి కూర్చొనే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం.' అని ట్వీట్ చేసింది.
ఈ స్థానానికి ద్రవిడ్ అన్ని విధాలా అర్హుడు
'హాల్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నందుకు శుభాకంక్షలు. ఈ స్థానానికి ద్రవిడ్ అన్ని విధాలా అర్హుడు' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications