Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎట్టకేలకు నెరవేరిన ప్రీతి జింటా కప్ కల.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఎట్టకేలకు బాలీవుడ్ నటి ప్రీతి జింటా కప్ కల నెరవేరింది. అయితే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున కాదు! కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ఈ సహయజమాని ప్రీతి జింటా.. ట్రోఫీ కలను సాధ్యం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్స్ అయిన ప్రీతి జింటా, నెస్ వాడియా, మోహిత్ బుమ్రాన్, కరన్ పాల్ కూడా సెయింట్ లూసియా సహ యజమానులే.

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)‌లో సెయింట్ లూసియా కింగ్స్‌కు ఇదే మొదటి టైటిల్. గయానా అమెజాన్ వారియర్స్‌తో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్‌లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సీపీఎల్-2024 విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 138 పరుగులు చేసింది.

The Wait is Over for Preity Zinta Not IPL but St Lucia Kings Lift Maiden Trophy with CPL 2024 Win

ప్రిటోరియస్ (25; 12 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షై హోప్ (22; 24 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్లు. సెయింట్ లూసియా బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు, ఖారీ, ఫోర్డె, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వైస్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

ఆరోన్ జోన్స్ (48 నాటౌట్; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (39 నాటౌట్; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్ డుప్లెసిస్ (21; 21 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశాడు. సెయింట్ లూసియా కింగ్స్ ఛేదన సాఫీగా సాగలేదు. 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ ఆరోన్-ఛేజ్ కలిసి సూపర్ ఛేజింగ్ చేశారు.

6 ఓవర్ నుంచి 15 ఓవర్లకు వరకు వీరిద్దరు ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. కానీ ఆ తర్వాత విజృంభించారు. మొయిన్ అలీ వేసిన 16వ ఓవర్‌లో ఆరోన్ జోన్స్ ఓ సిక్సర్, ఛేజ్ రెండు సిక్సర్లు,రెండు ఫోర్లు బాదారు. ఆ తర్వాతి ఓవర్‌లో ఆరోన్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. అదే జోరును వారిద్దరు తర్వాతి ఓవర్‌లోనూ కొనసాగించి విజయాన్ని ఖరారు చేసి ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించారు. కాగా, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ 16 ఏళ్లుగా కప్ కోసం పోరాడుతూనే ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Monday, October 7, 2024, 10:39 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+