For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఫొటో షూట్‍ అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్..

 The videos of team India players participating in photo shoot are going viral on social media

15 సంవత్సరాల టీ20 కప్ కరువుకు ముగింపు పలకాలని భారత ఆటగాళ్లు చూస్తున్నారు. 2021 ఎడిషన్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో వైఫల్యం, ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పది వికెట్ల పరాజయం పాలవటం మార్చిపోయి ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్నారు. భారత్ సూపర్ బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌తో, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఆదివారం అక్టోబర్ 23 మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే 2022 T20 ప్రపంచ కప్ మ్యాచ్ కు ముందు టీమిండియా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించింది.

ఫోటోషూట్

ఫోటోషూట్

టోర్నమెంట్‌కు ముందు మెన్ ఇన్ బ్లూ ప్రీ-టోర్నమెంట్ ఫోటోషూట్ కోసం సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి T20 ప్రపంచ కప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఫోటోబాంబ్ చేయడం చూడవచ్చు. వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ MCG ఖాళీ స్టాండ్ నుంచి వాతావరణాన్ని చూస్తునట్లు కనిపిస్తుంది.

ఆస్ట్రేలియా న్యూజిలాండ్

ఆస్ట్రేలియా న్యూజిలాండ్

ఫొటో షూట్ లో విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, సూర్య కుమార్ యాదవ్, చాహల్, రోహిత్ శర్మ, అశ్విన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హర్ష్ దీప్ సింగ్ పాల్గొన్నారు. కాగా శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్ లు జరగనున్నాయి. సూపర్-12 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డు తగిలే అవకాశం ఉంది.

వర్షం

బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ 1 నుంచి 3 మిమీ వర్షంతో 80% వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం అక్టోబర్ 23న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గత నెల ఆసియా కప్ తర్వాత రెండు జట్ల రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. అయితే సిడ్నీలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట."చాలా ఎక్కువ (90%) జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది" అని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది.

Story first published: Friday, October 21, 2022, 14:37 [IST]
Other articles published on Oct 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+