T20 World Cup 2022: కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ చాలా చురుగ్గా చేస్తాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు అలావోగా డబుల్స్ తీస్తుంటాడు. ఫీల్డింగ్ లోనూ ఆశ్ఛర్య పరుస్తుంటాడు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ సంబంధించిన విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిమ్ డెవిడ్ ను కోహ్లీ రన్ ఔట్ కూడా చేశాడు. డైరెక్ట్ గా వికెట్లకు త్రో చేసి ఔట్ చేశాడు.
కేఎల్ రాహుల్
కాగా ఈ వార్మప్ మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. సూర్యాకుమార్ యాదవు 33 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ స్న్ 4 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్ వెల్, అగర్, స్టార్క్ ఒక్కో వికెట్ తీశారు.
ఆరోన్ ఫించ్
187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఆరోన్ ఫించ్ బౌండరీలతో అలరించారు. 18 బంతుల్లో 35 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. మరో ఎండ్ ఫించ్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత తేరుకున్న భారత్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫిల్డింగ్ కూడా బాగుండడంతో భారత్ విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications