Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BBL 2023- టాస్ ‘డ్రా’ అయింది.. డిఫ్రెంట్‌గా ట్రై చేసి పరువు తీసుకున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే లీగ్ లో కొత్తదనం జత చేయాలని నిర్వాహకులు కాస్త వినూత్నంగా ఆలోచించారు. టాస్ కాయిన్ తోనే వేయడం రొటీన్.. అందుకే ఈ సారి బ్యాటుతో డిఫ్రెంట్ గా ట్రై చేద్దామని అనుకున్నారు.

మంగళవారం జరుగుతున్న సిడ్నీ థండర్ - బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ లో దీన్ని ట్రై చేశారు. బ్యాటును కాయిన్ లా గాల్లోకి విసిరారు. బ్యాటు బోర్లా పడటం, పడకపోవడం వంటి గుర్తులతో కెప్టెన్లు తమ నిర్ణయాన్ని చెప్పాలని అన్నారు. కానీ బ్యాట్ ఎటూ పడకుండా సరిగ్గా మధ్యలో నిలబడింది.

The toss was drawnin BBL 2023. Australia tried differently but loss prestiage

ఆ తర్వాత ఏం చేయాలో నిర్వాహకులకు అర్థంకాలేదు. మళ్లీ ఇంకోసారి గాల్లోకి బ్యాటును విసిరారు. మొత్తంగా బ్యాటు ఒక వైపున పడింది. దాంతో సిడ్నీ థండర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే బీబీఎల్ నిర్వాహకులపై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.

కొత్తగా ట్రై చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా పరువు తీసుకుంటుందని, కాయిన్ తో వచ్చిన ఇబ్బంది ఏంటని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ 'డ్రా' ముగియడం చూస్తుంటాం కానీ ఇక్కడ టాస్ డ్రా ముగిసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల జరిగిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్ పిచ్ కారణంగా రద్దు కావడంపై క్రికెట్ ఆస్ట్రేలియాను అభిమానులు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ 6.5 ఓవర్ల పాటు సాగిన తర్వాత అంపైర్లు రద్దు చేశారు. పిచ్ ప్రమాదకరంగా ఉందని, భిన్నంగా స్పందిస్తూ బాల్స్ బౌన్స్ అవుతున్నాయని ఇరు జట్లకు పాయింట్లను సమానంగా పంచారు.

Story first published: Tuesday, December 12, 2023, 15:01 [IST]
Other articles published on Dec 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+