For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ కెరీర్‌లో టాప్ 5 వన్డే ఇన్నింగ్స్ ఇవే..!!

The top five ODI innings of Rohit Sharma

బెంగళూరు: గువాహటి వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 20వ వన్డే సెంచరీని నమోదు చేసుకున్నాడు. అతని కెరీర్‌లో కేవలం సెంచరీలే కాదు. 150పరుగుల మార్క్ కూడా ఆరు సార్లు దాటాడు. ఇటీవల ముగిసని ఇన్నింగ్స్‌లో 152కూడా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా ఆడిన టాప్ 5 వన్డే ఇన్నింగ్స్ వివరాలిలా ఉన్నాయి.

264 vs శ్రీలంక, 2014

264 vs శ్రీలంక, 2014

రోహిత్ వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 264పరుగులు. కేవలం 173 బంతుల్లో 264 పరుగులు (33ఫోర్లు, 9సిక్సులు)పూర్తి చేశాడు. రోహిత్ బాదుడుకి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 404పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన శ్రీలంక 153పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

 209 vs ఆస్ట్రేలియా, 2013

209 vs ఆస్ట్రేలియా, 2013

రోహిత్ కెరీర్‌లో గుర్తుండిపోయే విషయాల్లో ఇదొకటి. క్రికెట్ కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీల్లో ఈ ఇన్నింగ్స్ నిలిచిపోతుంది. భారత క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్‌లతో పాటుగా రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. 209పరుగులు చేసిన శర్మ(158 బంతుల్లో, 12 ఫోర్లు, 16 సిక్సులు)చేసి భారత్‌ను గెలిపించాడు.

137 vs ఇంగ్లాండ్, 2018

137 vs ఇంగ్లాండ్, 2018

ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి వన్డేలో రోహిత్ అదరగొట్టేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను కుల్దీప్ యాదవ్ కేవలం 25 పరుగులిచ్చి 6వికెట్లు పడగొట్టాడు. ఆ దెబ్బతో టీమిండియా 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మెరుపు షాట్లు బాదిన రోహిత్ 137పరుగులు(114బంతుల్లో, 15ఫోర్లు, 4 సిక్సులతో)చేశాడు. రోహిత్ స్కోరు తోడవడంతో భారత్ 40.1ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది. దీంతో భారత్ 1-0తేడాతో శుభారంభాన్ని నమోదు చేసింది.

 137 vs బంగ్లాదేశ్, 2015

137 vs బంగ్లాదేశ్, 2015

మెల్‌బౌర్న్ వేదికగా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై విరుచుకుపడ్డాడు రోహిత్. ఏకంగా రోహిత్ శర్మ 137పరుగులు చేసి జట్టుకు ఆధిక్యాన్నందించాడు. దీంతో భారత్302/6పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ 109పరుగుల తేడాతో ఓడించేసింది.

86 vs వెస్టిండీస్, 2011

86 vs వెస్టిండీస్, 2011

ఆ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ నుంచి ప్రత్యేకమైన ఇన్నింగ్స్ వస్తేనే కానీ, మ్యాచ్ గెలవదు. ఆ సందర్భంలో మెరుపు షాట్లు కొట్టాడు రస్సెల్(92: 64బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సులు) చేశాడు. ఇలా వెస్టిందడీస్ 225పరుగులకు ఎనిమిది వికెట్లు నష్టపోయి ఇన్నింగ్స్ ముగించింది. ఆ తర్వాత చేధనకు దిగిన భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆరు వికెట్ల నష్టానికి 92పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ (86: 91 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సులు) చేశాడు. ఆ మ్యాచ్‌కు ప్రవీణ్ కుమార్ కెప్టెన్సీ వహించాడు. ఈ మ్యాచ్‌తో భారత్ 3-0తేడాతో సిరీస్ గెలిచింది.

Story first published: Monday, October 22, 2018, 16:13 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+