Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైటిల్ అందిస్తా.. వాటర్ బాటిల్స్ మోస్తా: సన్‌రైజర్స్‌కు వార్నర్ రియల్ వారియర్

టెస్టులతో పాటు వన్డేలకు కూడా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన చివరి టెస్టు ప్రారంభానికి రెండు రోజుల ముందు వన్డే ఫార్మాట్‌పై కీలక నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 37 ఏళ్ల వార్నర్ ఫేర్‌వెల్ వన్డే ఆడకుండానే వీడ్కోలు పలకనుండటం ఫ్యాన్స్‌కు బాధగా ఉంది.

అయితే వార్నర్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయినా మన తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు ఎప్పటికీ ఫేవరేట్ ప్లేయర్‌గానే ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అతడు పోరాడిన తీరు, టాలీవుడ్‌లో స్టార్ హీరోల డ్యాన్స్, స్టెప్పులతో వార్నర్ తెలుగు వారికి అత్యంత దగ్గరగా అయ్యాడు. సన్‌రైజర్స్ యాజమాన్యంతో విభేదాల కారణంగా వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లినా తెలుగు ఫ్యాన్స్‌తో నెట్టింట్లో ఇప్పటికీ ముచ్చటిస్తూనే ఉన్నాడు.

The title will be provided and the water bottles will be taken: David Warner is a real warrior for Sunrisers Hyderabad

ఐపీఎల్‌లో అత్యంత విలువైన విదేశీ ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున లీగ్‌లో అడుగుపెట్టిన వార్నర్ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. 2021 సీజన్ వరకు హైదరాబాద్‌తోనే ఉన్నాడు. జట్టుకు వెన్నముకగా పరుగుల వరద పారించాడు. 2015లో SRH కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. కానీ ఆ సీజన్‌లో జట్టును ప్లే ఆఫ్స్‌కు తీసుకొని వెళ్లలేకపోయాడు. అయితేనేం 562 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.

ఇక 2016 సీజన్‌లో ఫైనల్‌లో ఆర్సీబీని ఓడించి సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపాడు. తొలి టైటిల్ అందించాడు. ఫైనల్‌లో 38 బంతుల్లో 69 పరుగుల అతడి ఇన్నింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతేగాక ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2017లో జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. కానీ మరోసారి 641 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.

అయితే బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న డేవిడ్ వార్నర్ 2018 సీజన్‌కు దూరమయ్యాడు. కానీ కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో తిరిగి 2019లో జట్టులోకి వచ్చిన వార్నర్ చెలరేగాడు. గాయపడిన సింహంలా విజృంభించాడు. 692 పరుగులు చేసి మరోసారి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అయితే 2020లో వార్నర్ తిరిగి కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్‌లో 5000 పరుగులు సాధించిన తొలి విదేశీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

అయితే యాజమాన్యంతో విభేదాల కారణంగా 2021 సీజన్ వార్నర్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలింది. తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అంతేగాక వాటర్ బాయ్‌గా సేవలు అందించాడు. సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్ అందించిన వార్నర్ తన జట్టు కోసం వాటర్ బాటిల్స్ కూడా అందించాడు. ఇప్పటికీ వార్నర్-SRH మేనేజ్మెంట్ మధ్య వివాదాల మరోసారి వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వార్నర్‌ను SRH బ్లాక్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Story first published: Monday, January 1, 2024, 10:22 [IST]
Other articles published on Jan 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+