For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మార్చి 6 నుంచి ముక్కోణపు సిరీస్‌లో భారత్

The third country participating in the series is Bangladesh. The tournament will be held from March 6 to March 18.

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ప్రత్యేక శ్రద్ధతో వీక్షించే ముక్కోణపు సిరీస్ మ్యాచ్ అనుకున్నదాని కంటే ఇంకా ముందే జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాలు పాల్గొననున్నాయి. కాగా, ఈ ముక్కోణపు టీ20 సిరీస్‌ షెడ్యూల్‌లో జరిగిన స్వల్ప మార్పులు ఇలా ఉన్నాయి.

శ్రీలంకలో జరిగే ఈ సిరీస్‌ నిర్ణీత షెడ్యూల్‌ కంటే రెండు రోజులు ముందుగా మార్చి 6న ఆరంభం కానుంది.
శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న నేపథ్యంలో మ్యాచ్ కొంచెం ముందుగానే నిర్వహించనున్నారట. మార్చి 8 నుంచి 20వరకు జరగాల్సిన మ్యాచ్ మార్చి 6 నుంచి 18 వరకు జరగనుంది.

మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు కొలంబో లోని ప్రేమదశ స్టేడియంలోనే అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ప్రతి జట్టు మరో రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.

తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 18న ఫైనల్లో తలపడుతుంది. ఈ ప్రసార హక్కులను ఆ దేశ ప్రీమియర్ స్పోర్ట్స్ ఛానల్ సొంతం చేసుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 9:53 [IST]
Other articles published on Jan 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+