సౌతాఫ్రికా సిరీస్ కోహ్లీకి చావో రేవో.. ఓడితే ఉద్వాసనే!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొంతకాలంగా టైమ్ కలిసి రావడం లేదు. కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికీ బ్యాటర్‌గా మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. అంతేకాకుండా కీలక టోర్నీల్లో విరాట్ బ్యాటర్‌గానూ విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్‌నకు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం టెస్టులకు, వన్డేలకు కెప్టెన్‌గా కొనసాగాలని కోహ్లీ ఆశించినప్పటికీ అలా జరగలేదు. విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్‌గానూ తొలగించింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విరాట్ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం విరాట్ విమర్శలను బీసీసీఐ ఖండించిన సంగతి కూడా విధితమే. అయితే కోహ్లీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం అతడు బ్యాటర్‌గా విఫలమవడమే.

కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీకి కూడా గండం
ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీకి కూడా గండం పొంచి ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. దానికి అతని బ్యాటింగ్ తీరే కారణమంటున్నారు. నిజానికి గత రెండేళ్లుగా కోహ్లీ బ్యాటింగ్‌లో పెదగా రాణించలేకపోతున్నాడు. అయితే కెప్టెన్‌గా టీమ్‌ను అగ్ర స్థానంలో నిలిపినప్పటికీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను గెలిపించలేకపోయాడు.
దీంతో టెస్టుల నుంచి కూడా అతడిని కెప్టెన్‌గా తప్పించాలనే వాదనలు కూడా ఉన్నాయి. అలాగే ఇండియాకు ఒకే సమయంలో ఇద్దరు కెప్టెన్లు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. ఇవన్నీ పరిశీలిస్తే కోహ్లీకి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ చావో రేవో లాంటిదని చెప్పుకోవాలి. ఈ సిరీస్‌లో కోహ్లీ బ్యాటర్‌గా రాణించడంతోపాటు కెప్టెన్‌గానూ టీమిండియాను సిరీస్ గెలిపించాలి.
అప్పుడే కోహ్లీ కెప్టెన్సీకి డోకా ఉండదు. లేదంటే టెస్టు కెప్టెన్సీ కూడా రోహిత్‌కే అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అంతేకాకుండా బీసీసీఐ పెద్దలతో వచ్చిన విబేధాలు కూడా అతడి కెప్టెన్సీకి గండం తెచ్చిపెట్టాయి.

బ్యాటర్‌గా కోహ్లీ ఫేలవ ప్రదర్శన
గత రెండేళ్లుగా టెస్టు ఫార్మాట్‌లో బ్యాటర్‌గా కోహ్లీ విఫలమవుతున్నాడు. 33 సంవత్సరాల కోహ్లీ 2020 నుంచి 13 టెస్టుల్లో 23 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి కేవలం 26 సగటుతో 599 పరుగులే చేశాడు. అత్యధిక పరుగులు 74 మాత్రమే. ఈ రెండేళ్ల కాలంలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవెన్ స్మిత్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మెరుగ్గా రాణించారు.
ఈ రెండేళ్ల కాలంలో 57 సగటుతో రూట్ 2,013 పరుగులు చేయగా,74 సగటుతో విలియమ్సన్ 813 పరుగులు, 48 సగటుతో స్మిత్ 481 పరుగులు, 44 సగటుతో బాబర్ 754 పరుగులు చేశారు. ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ రెండేళ్ల కాలంలో 47 సగటుతో 906 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

వారి ఫెయిల్యూర్ కోహ్లీకి కలిసోస్తుందా?
బ్యాటర్‌గా కోహ్లీ విఫలమవుతున్నప్పటికీ టీమ్‌లో అతని స్థానానికి డోకా లేకపోవడానికి కారణం విరాట్ కెప్టెన్సీతోపాటు ఆ జట్టులో అతని సహచరులైన చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కూడా ఈ రెండేళ్ల కాలంలో బ్యాటర్లుగా విఫలమవడమే. ఈ రెండేళ్ల కాలంలో 16 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే 29 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 24 సగటుతో 683 పరుగులు చేశాడు.
అదే సమయంలో పుజారా కూడా 17 టెస్ట్ మ్యాచ్‌ల్లో 32 ఇన్నింగ్స్‌లో 849 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీపై వేటు వేయాలంటే పుజారా, రహానేపై కూడా వేయాల్సిన పరిస్థి ఉంది. అందుకే వీరు ముగ్గురికి సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications