T20 World Cup 2022: ఒక్క మ్యాచ్‍లో ఓడితే.. ట్రోల్ చేస్తారా..

ఆసియా కప్ 2022 ఛాంపియన్ శ్రీలంక.. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, లంకేయులు కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు. శ్రీలంక ఓటమితో ఆ దేశ క్రికెట్ అభినమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా చూపిస్తున్నారు.

నాగిని డ్యాన్స్
ఆసియా కప్ లో లంకేయులు చేసిన నాగిని డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. మీమ్స్ పోస్ట్ చేస్తూ లంక క్రికెటర్లను ఎద్దేవా చేస్తున్నారు. అయితే క్రికెటర్లను ట్రోల్ చేయడంపై క్రీడా నిపుణులు తప్పుబడుతున్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని.. ప్రతీ రోజు ఒకేలా ఉండదని వివరిస్తున్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రానా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.

ప్రారంభ మ్యాచ్ లో ఓడిపోయి
చాలా సార్లు కొన్ని జట్లు ప్రారంభ మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత కప్ సాధించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కేవలం ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు ఇలా అవమానించడం తగదని అభిప్రాపడుతున్నారు. గతంలో పెద్ద జట్లు పసికూన జట్ల చేతిలో ఓడిపోయాయని ఉదాహరిస్తున్నారు.
2007 టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది.2009 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై నెదర్లాండ్స్ గెలిచిందని గుర్తు చేశారు.

నమీబియా
అయితే నమీబియాను తక్కువ అంచనా వేయలేమన్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో వారు అన్ని రంగాల్లో రాణించారని. వారికి మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టిలో నమీబియా, నెదర్లాండ్ అగ్రస్థానంలో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications