
టీ20 వరల్డ్ కప్ 2022లో ప్రారంభ రోజే సంచలన విజయం నమోదు అయింది. పసికూన నమీబియా ఆసియా కప్ విజేత శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఏకంగా 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. నమీబియా అన్ని విభాగాల్లో మెరుగ్గా లంకేయులనే కాదు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక కొన్ని తప్పిదాలు చేసింది. ఫలితంగా మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది.
8 జట్లు
వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో టాప్ లో ఉన్న నాలుగు సూపర్ 12 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజీలో శ్రీలంక, వెస్టిండీస్ ఫేవరెట్లుగా ఉన్నాయి. ఆదివారం జరిగిన ఓపెనర్‌లో మిన్నోస్ నమీబియా చేతిలో చిత్తుగా ఓడింది. వారి ఫీల్డింగ్ సమయంలో అనవసర ఓవర్‌త్రో వేశారు. దీంతో నమీబియాకు ఒక్క పరుగు ఇచ్చింది. మ్యాచ్ 9 ఓవర్ లో వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ అనవసరంగా బంతిని విసిరాడు.
అయోమయంలో ఫీల్డర్‌లు
ఇద్దరు ఫీల్డర్‌లు అయోమయంలో పడ్డారు. నమీబియా బ్యాటర్లు సింగిల్ తీశారు. దీనిపై లంక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే ఆలౌట్ అయింది. నమీబియా ఆటగాళ్లలో జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లో 44 పరుగులు చేసి టాప్ స్కోరింగ్ బ్యాటర్‌గా నిలిచాడు.