ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌ల కోసం తమ స్క్వాడ్‌ను ప్రకటించిన శ్రీలంక బోర్డు

ఆస్ట్రేలియాతో జూన్ 7న స్వదేశంలో ప్రారంభం కానున్న టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియాతో షెడ్యూల్‌లో మూడు టీ20లు, 5వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఉంటాయి. దిముత్ కరుణరత్నే టెస్ట్ గేమ్‌కు నాయకత్వం వహిస్తుండగా, టీ20, వన్డే ఫార్మాట్ల గేమ్‌లకు దసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఆస్ట్రేలియా ఇప్పటికే శ్రీలంకతో సిరీస్ కోసం ఇప్పటికే బలమైన టీంను ప్రకటించింది. టెస్టు జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ వహిస్తుండగా.. వైట్ బాల్ స్క్వాడ్‌లకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహించనున్నాడు. రాబోయే సిరీస్‌కు సిద్ధం కావడానికి శ్రీలంక జట్టు 24మందితో కూడిన టెస్ట్ జట్టును, 26మంది సభ్యులతో కూడిన వన్డే, టీ20జట్లను ఎంపిక చేసింది.

శ్రీలంక ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే మ్యాచ్‌లు ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌‌లో భాగమవుతాయి. టెస్టులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23సైకిల్‌లో భాగంగా ఉంటాయి. జూన్ 7నుంచి 11వరకు మూడు టీ20లు, జూన్ 14 నుంచి 24మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. జూన్ 29 నుంచి జూలై 3, జూలై 8 నుంచి 12మధ్య రెండు టెస్టులు జరుగుతాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ జట్ల కూర్పును మరింత మెరుగుపరుచుకోవడానికి ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నాయి. ఇకపోతే శ్రీలంక ప్రకటించిన జట్లు తాత్కాలిక జట్లుగా పేర్కొనడం గమనార్హం.

రెండు జట్లకు ఈ సిరీస్ అత్యంత ముఖ్యమైంది. అయినప్పటికీ శ్రీలంకలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ సిరీస్ నిర్వహణ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో పాటు ఇంధనం, విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక.. ఆస్ట్రేలియా పర్యటనను ఎలా నిర్వహించగలదో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సంవత్సరం ఆసియా కప్‌కు కూడా శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నందున.. త్వరగా శ్రీలంకలో పరిస్థితులు మెరుగై సాధారణ స్థితికి రావాలని శ్రీలంక క్రికెట్ బోర్డు కోరుకుంటుంది.

ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం శ్రీలంక బోర్డు ప్రకటించిన తాత్కాలిక టీంలు
టెస్ట్ జట్టు
దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, ఒషాద ఫెర్నాండో, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దినేష్ చండిమాల్, చమిక కరుణరత్నే, రమేష్ మెండిస్, ఎఫ్‌షాన్‌ల్ మరాందుషాన్, డి. కుమార, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే, లక్షిత రసంజనా, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్దేనియా, సుమింద లక్ష్మణ్

వన్డే జట్టు
దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, అషెన్ బండార, దినేష్ చండిమాల్, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియానగే, దునిత్ వెల్లలగే, ధనంజయ లక్ష్మణ్, వనంజయ లక్ష్మణ్ కరుణరత్నే, లహిరు మధుశంక, రమేష్ మెండిస్, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, దిల్షన్ మధుశంక, లహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రీ వాండర్సే, మహేశ్ తీక్షణ, ప్రవీణ్ జయవిక్రమ

టీ20 జట్టు
దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, అషెన్ బండార, నిరోషన్ డిక్‌వెల్లా, దునిత్ వెల్లలగే, ధనంజయ లక్ష్మణ్, సహన్ ఆరాచ్చి, వనీందు హసరంగా, చమిక, రమేశ్ కరుణారత్నే, చమీక కరుణారత్నే , బినుర ఫెర్నాండో, మతీష పతిరన, నువాన్ తుషార, కసున్ రజిత, నిపున్ మలింగ, లహిరు కుమార, జెఫ్రీ వాండర్సే, మహేశ్ తీక్షణ, ప్రవీణ్ జయవిక్రమ, లక్షన్ సండకన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 20, 2022, 18:32 [IST]
Other articles published on May 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X