Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటళ్లు జైళ్లలాంటివి.. కెరీర్‌కే ముప్పు వాటిల్లుతుంది: కోహ్లీ

The secret behind the success of Virat Kohli and Anushka family life

హైదరాబాద్: సెలబ్రిటీ అవడం కాదు కష్టం అది కాపాడుకోలేకపోతే మొత్తానికే ఎసరు అంటున్నాడు విరాట్ కోహ్లీ. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడేందుకు హోటళ్లకు వెళుతూంటాం. ఆ సమయంలో తాము ఉండే లగ్జరీ హోటళ్లే తమకు రాయల్ జైళ్లలాంటివి అని కోహ్లి అన్నాడు.

నేరుగా వెళ్లి కాసేపు కూర్చునే వీలు కూడా

నేరుగా వెళ్లి కాసేపు కూర్చునే వీలు కూడా

ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. హోటల్ రూమ్స్‌లో ఉన్న సమయంలో ఏమీ చేయడానికి వీలుండదని చెప్పాడు. హోటల్లో ఉన్నపుడు భోజనం కూడా రూమ్‌లోకే తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సెలబ్రిటీ స్టేటస్ కారణంగా కనీసం హోటల్లో ఉన్న రెస్టారెంట్‌కు నేరుగా వెళ్లి కాసేపు కూర్చునే వీలు కూడా ఉండదని అతను అన్నాడు. ఇక హోటల్ బయటకు వెళ్లే సాహసం అసలే చేయబోనని కోహ్లి చెప్పాడు.

ఎలాగోలా స్టాఫ్ కారిడార్లలో నుంచి కనిపించకుండా

ఎలాగోలా స్టాఫ్ కారిడార్లలో నుంచి కనిపించకుండా

ఏడేళ్ల కిందట తనకు ఇంత పాపులారిటీ లేని సమయంలో హాయిగా వెళ్లి గంటల తరబడి రెస్టారెంట్లో కూర్చున్నా ఎవరో పట్టించుకునేవాళ్లు కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. ఎలాగోలా స్టాఫ్ కారిడార్లలో నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతానని చెప్పాడు. ఇలాగే విదేశాల్లో ఉన్నప్పుడు అనుష్క, కోహ్లీ కాఫీ షాప్‌కు వెళ్లినప్పుడు అక్కడు ముగ్గురు ఇండియన్స్ వాళ్లని గుర్తు పట్టేశారని వాళ్లని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దంటూ కోరాల్సి వచ్చిందని తెలిపాడు.

 సెలబ్రిటీ స్టేటస్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోతే

సెలబ్రిటీ స్టేటస్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోతే

అయితే ఈ సెలబ్రిటీ స్టేటస్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోతే మాత్రం కెరీర్‌కే ముప్పు వాటిల్లుతుందని యువ క్రికెటర్లకు అతను సూచించాడు. తన జీవితం ఓ పెద్ద ప్రయోగమని, భవిష్యత్తు తరాలు దాన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చని కోహ్లి అన్నాడు. తను ఇంటికి వెళ్లేసరికి గెలుచుకున్న ట్రోఫీలు, లక్ష్యాలు, ఇవేమీ గుర్తుండవని తెలిపాడు.

నాకూ ఓ కుటుంబం, సరదాలు:

నాకూ ఓ కుటుంబం, సరదాలు:

నా భార్య అనుష్క దగ్గరి నుంచి కొన్నేళ్లుగా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. అవి చెప్పడానికి కూడా వీల్లేదు. ఒకవేళ వాటికర్థం ఇవి జీవితాంతం చెయ్యాల్సి వస్తే.. వాటికంటే 100రెట్లు చేసేస్థా. ఇలా చేయగలగడం దేవుడిచ్చిన వరం. పిల్లల గురించి ఏమీ అనుకోవడం లేదా అనే ప్రశ్నకు నాకు పిల్లలంటే ఇష్టం. నాకూ ఓ కుటుంబం ఉంది. సరదాలు ఉన్నాయి.

Story first published: Wednesday, May 23, 2018, 16:44 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+